పర్వత ప్రాంతాల్లో చైనా సైనికులు పనిచేయలేరు

పర్వత ప్రాంతాల్లో చైనా సైనికులు పనిచేయలేరు

గల్వాన్ లాంటి లోయ, పర్వత ప్రాంతాల్లో చైనా సైనికులు పనిచేయలేరని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ అన్నారు. నియంత్రణ రేఖ వెంబడి ప్రస్తుతం కాల్పులు జరగడం లేదని ఆయన అన్నారు. ఇది ఒక విధంగా మంచి పరిణామమని రావత్ అన్నారు. కానీ డ్రోన్ల సాయంతో ఆయుధాలు, మందుగుండు అక్రమ రవాణా జరుగుతుందని ఆయన అన్నారు. ఇది అంతర్గత శాంతికి భంగం కలిగిస్తుందన్నారు. ఆయుధాల అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఆయన తెలిపారు. జమ్ము కశ్మీర్ ప్రజలు కూడా శాంతిని కోరుకుంటున్నారని రావత్ చెప్పారు. స్థానికుల మద్దతు లేకుండా లోయలో ఉగ్రవాదం, తిరుగుబాటు ఉండవన్నారు. తప్పుదారి పడుతున్న యువతను గుర్తించాల్సిన అవసరం ఉందని రావత్ సూచించారు. పాకిస్థాన్ ప్రస్తుతం సరిహద్దు వెంబడి కాల్పులు జరపకపోవడానికి చాలా అంశాలు ఉన్నాయన్నారు. నార్తర్న్ ఫ్రంట్‌తో పాటు వెస్టర్న్ ఫ్రంట్ కూడా ముఖ్యమే అని ఆయన అన్నారు. గతేడాది మే లో గల్వాన్, ఇతర ప్రాంతాల్లో జరిగిన సంఘటనల తర్వాత సరిహద్దులో చైనా బలగాల మొహరింపులో మార్పులు వచ్చాయన్నారు. గల్వాన్ లాంటి ఏరియాల్లో చైనా సైనికులు పని చేయలేరన్నారు. పర్వత ప్రాంతాల్లో పని చేయాలంటే ప్రత్యేక శిక్షణ ఉండాలన్నారు. ఆ శిక్షణ చైనా ఆర్మీకి చాలా అవసరమని ఆయన అన్నారు. ఈ విషయంలో ఇండియన్ సైనికులకు మంచి అనుభవం ఉందన్నారు. చైనా యాక్టివిటీస్‌ని నిశితంగా పరిశీలిస్తున్నామని ఆయన అన్నారు