గల్వాన్​ నదీ ప్రవాహానికి చైనా అడ్డంకులు

గల్వాన్​ నదీ ప్రవాహానికి చైనా అడ్డంకులు

ఉత్తర లడాఖ్​లో గల్వాన్​ నదీ ప్రవాహాన్ని దెబ్బ తీసేందుకు చైనా ప్రయత్నిస్తున్నట్టు తాజా శాటిలైన్​ ఇమేజెస్​లో స్పష్టమయ్యింది. ఇందుకోసం సరిహద్దుల్లో చైనా బుల్​డోజర్లను కూడా మోహరించినట్టు తెలుస్తోంది. మూడ్రోజుల క్రితం ఇండియా–చైనా సైనికులు తలపడిన స్థలానికి కిలోమీటర్​ దూరంలోనే భారీగా బలగాలను మోహరించినట్టు సమాచారం. మన​ మేజర్​ జనరల్​, చైనా మేజర్​ జనరల్​తో రెండ్రోజులుగా గల్వాన్​ వ్యాలీలో చర్చలు జరిపినా ఎటువంటి ఫలితం లేకపోయింది. బలగాలను వెనక్కి తీసుకునేందుకు చైనా అంగీకరించలేదు. నేషనల్​ చానెల్స్​కు దొరికిన శాటిలైట్​ ఫొటోల్లో చైనా బుల్​డోజర్లను వాడినట్టు క్లియర్​గా కనిపించింది. లైన్​ ఆఫ్ యాక్చువల్​ కంట్రోల్(ఎల్ఏసీ) దగ్గర చైనా వైపు గల్వాన్​ నదీ ప్రవాహాన్ని మార్చినట్టుగా అందులో కనిపించింది. ఇదే ప్రాంతంలో వందకుపైగా చైనా​ వెహికల్స్​ ట్రక్కులు, మిలిటరీ వాహనాలు, బుల్​డోజర్లు కనిపించాయి. దాదాపు ఎల్​ఏసీకి అవతల ఐదు కిలోమీటర్ల పరిధిలో చైనా వాహన శ్రేణి విస్తరించి ఉంది. రెండు ప్రాంతాల్లో సైనికులు ఉండేందుకు గుడిసెలను ఏర్పాటు చేశారు. గల్వాన్​ వ్యాలీకి రెండు కిలోమీటర్ల దూరంలో మన  ఆర్మీ ట్రక్కులు కనిపించాయి. అయితే ఈ ఇమేజ్​లను సెక్యూరిటీ కారణాల వల్ల పోస్ట్​ చేయలేదు. ప్రస్తుతం గల్వాన్​ నది ప్రవాహం మామూలుగానే ఉందని, ఎటువంటి మార్పు లేదని మన​ ఆర్మీ వర్గాలు తెలిపాయి.