21 ఏళ్ల మహిళ బరువు తగ్గాలనుకుంది.. కానీ జిమ్ సెంటర్ లో ఏం జరిగిందంటే..

21 ఏళ్ల మహిళ బరువు తగ్గాలనుకుంది..  కానీ జిమ్ సెంటర్ లో ఏం జరిగిందంటే..

ఎనిమిది నెలల్లో 36 కిలోల బరువును తగ్గించుకోగలిగింది మరియు మొదటి రెండు నెలల్లో 26 కిలోల బరువు తగ్గింది, తరువాత ఆరు నెలల్లో 10kg తగ్గింది. ఆతర్వాత..

ఈ మధ్యకాలంలో జిమ్ లో  వర్కౌట్స్ చేస్తూ, వర్కౌట్ చేసిన తర్వాత ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయి. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా  నెలలో కనీసం వంద మందిలో పదిమంది అయినా జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ మరణిస్తున్నారు.  ఇప్పుడు చైనాలో 21 ఏళ్ల మహిళ కుయిహువా అనే మహిళ తన బరువును తగ్గించుకొనేందుకు జిమ్ సెంటర్లో  శిక్షణ పొందే సమయంలో ఆమె మరణించిందని కుటుంబసభ్యులు తెలిపారు.  

బరువు తగ్గాలని...

చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్‌లోని జియాన్‌లోని కుయిహువా తన  బరువును తగ్గించుకొనేందుకు జిమ్ సెంటర్ లో జాయిన్ అయింది. 21 ఏళ్ల చైనీస్ ఇన్‌ఫ్లుయెన్సర్ 90 కిలో గ్రాములు (200 పౌండ్లు) తగ్గడానికి ప్రయత్నించి మరణించినట్లు న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. టిక్‌టాక్  చైనీస్ వెర్షన్ డౌయిన్ పేజీలో కుయిహువా  మరణాన్ని ఆమె కుటుంబ సభ్యులు ధృవీకరించారు.  అయితే కుయిహువా మరణానికి కారణం ఇంకా పూర్తిగా తెలియరాలేదని .. వ్యాయామం చేసిన తరువాత ఆమె అస్వస్థతకు గురైందని.. వెంటనే ఆస్పత్రికి తరలించామని జిమ్ నిర్వాహకులు తెలిపారు. 

ప్రాణం మీదకు తెచ్చుకోవద్దు

కుయిహువా పట్ల మీ మద్దతు ,  ప్రేమకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మా అమ్మాయి  స్వర్గానికి వెళ్లిందంటూ మరణానంతర కార్యక్రమాలు చేస్తున్నామని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. వినోదం కోసం ప్రాణం మీదకు తెచ్చుకొనే పనులు చేయవద్దని సూచించారు.  కొంతమంది చెప్పిన మాటలు విని తమ కుమార్తె బరువు తగ్గడానికి జిమ్ సెంటర్ లో చేరిందని ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
 

ఎక్కువుగా వర్కౌట్

కుయిహువా అనే చైనా ఇన్‌ఫ్లుయెన్సర్ డైలీ లైఫ్ లో భాగంగా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టింది.త్వరగా బరువు తగ్గేందుకు  జిమ్ సెంటర్ లో ఎక్కువుగా వర్కౌట్ చేయడం ప్రారంభించింది. బరువు తగ్గేందుకు ఆహార నియమాలు కూడా పాటించింది.ఆమె దినచర్యకు సంబంధించి 100కి పైగా వీడియోలతో డాక్యుమెంట్ చేసింది. ఇందులో అధిక-తీవ్రత కలిగిన కార్డియో,లావాటి తాళ్లు (సైనికులు ఉపయోగించేవి)  వెయిట్‌లిఫ్టింగ్ వంటి బలమైన  శిక్షణ వ్యాయామాలు ఉన్నాయి.  చైనా ఇన్‌ఫ్లుయెన్సర్‌కు డౌయిన్‌లో దాదాపు 10,000వేల మంది ఫాలోవర్స్  ఉన్నారు.

డైటింగ్ లో కూడా తేడా

షాంఘై మార్నింగ్ న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం కుయిహువా  జిమ్ క్యాంటిన్ లో ముతక ధాన్యాలు, క్యాబేజీ, గుడ్లు , పండ్లతో కూడిన కఠినమైన ఆహారాన్ని తక్కువ మోతాదులో తిన్నది. పగటిపూట వ్యాయామం చేయడంతో పాటు సాయంత్రం కూడా వర్కవుట్ చేస్తూ కష్టపడుతున్నట్లు వీడియోల్లో కనిపించింది. కుయిహువా వ్యాయామం చేసిన ఆరు నెలల్లో 80 పౌండ్లు (36కిలోలు) తగ్గింది.  ఆమె మొదటి రెండు నెలల్లో 200 పౌండ్లు (90కిలోలు) తగ్గించాలనే లక్ష్యంతో 57 పౌండ్లు (25కిలోలు) తగ్గిందని జిమ్ నిర్వాహకులు తెలిపారు.

నెటిజన్ల అభిప్రాయాలేంటంటే..

ప్రస్తుతం ఆమె మరణం ఇప్పుడు చైనీస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  చాలామంది బరువు తగ్గించే శిబిరంలోకి కుయిహువాను బలవంతంగా నెట్టారంటూ.. ఇంకా శిక్షణా నియమావళి , భద్రత అంశాల గురించి  ప్రశ్నిస్తున్నారు.  బరువు తగ్గడం చాలా వేగంగా ఉంటుంది.. మరియు హృదయం నిలకడగా ఉండదని ఒక వినియోగదారుడు పోస్ట్ చేయగా..  ఇది ఒకేసారి అధిక-తీవ్రత కాదు, గుండె మరియు మోకాలు తట్టుకోలేవు. , మరియు అకస్మాత్తుగా చనిపోవడం చాలా సులభమంటూ మరొకరు ఇలా వ్యాఖ్యానించారు. ఇంకొకరు ఈ కోచ్‌లకు  సమగ్ర పరిజ్ఞానం లేదంటూ.. వారంతా స్పోర్ట్స్ స్కూల్ ట్రైనీలని రాసుకొచ్చారు. 

అతిగా వ్యాయామం చేయడం చెడ్డదా? 

వ్యాయామం చేయడం వల్ల మీరు ఆరోగ్యకరమైన బరువుతో ఉండటానికి, మీ హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు డిప్రెషన్‌ను దూరం చేయడానికి కూడా సహాయపడుతుంది. అయితే అధిక వ్యాయామం మీ శరీరం మరియు మెదడుపై తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది. మీ సామర్థ్యానికి మించి వ్యాయామం చేయడం వల్ల కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇది మీ వయస్సు, ఆరోగ్యం, వ్యాయామాల ఎంపిక వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. కానీ సాధారణంగా, పెద్దలు వారానికి ఐదు గంటలు మితమైన వ్యాయామం లేదా రెండున్నర గంటలు లేదా అంతకంటే ఎక్కువ తీవ్రమైన వ్యాయామాలు చేయడం మంచిది. లేదా రెండింటిని కలిపి కూడా వ్యాయామం చేయడం ఉత్తమమని ఫిట్ నెస్ నిపుణులు చెబుతున్నారు.