వేడి చేసినా కరగని ఐస్‌‌‌‌‌‌‌‌క్రీం చూశారా..?

వేడి చేసినా కరగని ఐస్‌‌‌‌‌‌‌‌క్రీం చూశారా..?

చల్లచల్లని ఐస్‌‌‌‌‌‌‌‌క్రీంను ఎవరు మాత్రం ఇష్టపడరు. కరిగిపోయే లోపే పూర్తిగా ఖాళీ చేయాలనుకుంటారు. కానీ చైనాలోని ‘హీర్మేస్ ఆఫ్ ఐస్‌‌‌‌‌‌‌‌క్రీం’ను చూస్తే మాత్రం  భయపడుతున్నారు కొంతమంది. మంటలో ఉంచినా కూడా కరగని ఆ ఐస్ క్రీమ్‌‌‌‌‌‌‌‌ను చూసి నోరెళ్లబెడుతున్నారు.
'హీర్మేస్ ఆఫ్ ఐస్‌‌‌‌‌‌‌‌క్రీం'గా పిలిచే చైనీస్ లగ్జరీ ఐస్‌‌‌‌‌‌‌‌క్రీం.. మంటలో కాలిన తర్వాత కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది. పది డాలర్లు విలువ చేసే ఈ ఐస్‌‌‌‌‌‌‌‌క్రీంను ఒక గదిలో హై టెంపరేచర్ వద్ద  ఉంచినా కూడా కరగకుండా ఉండడాన్ని చూసి చాలామంది షాక్ అవుతున్నారు. దీంతో అసలు ఇది తినొచ్చా లేదా అన్న డౌట్ కూడా చాలామందికి వస్తోంది. అయితే  చైనీస్ లగ్జరీ ఐస్ క్రీం బ్రాండ్ ‘ఝాంగ్ జూ గావో’ మాత్రం ‘ఈ ఐస్‌‌‌‌‌‌‌‌క్రీం ఫుడ్ సేఫ్టీ ప్రమాణాల ప్రకారమే తయారు చేశారని, దీన్ని భయం లేకుండా తినొచ్చ’ని పేర్కొంది.