రూ.2 లక్షల పందెం.. 10 నిమిషాల్లో.. లీటర్ మందు తాగాలి.. ఆ తర్వాత ఏమైంది..?

రూ.2 లక్షల పందెం.. 10 నిమిషాల్లో.. లీటర్ మందు తాగాలి.. ఆ తర్వాత ఏమైంది..?

లిక్కర్ పందెం.. చావు పందెం అనటంలో సందేహం లేదు.. గతంలో చాలా సార్లు.. చాలా మందు పందాలు విషాదం అయ్యాయి.. అలాంటి తరహాలోనే ఇప్పుడు ఓ లిక్కర్ బెట్.. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం అయ్యింది. చైనాలో జరిగిన ఈ ఘటన వైరల్ అయ్యింది. ఆఫీసులో పని చేస్తున్న ఉద్యోగులు అందరూ.. వీకెండ్ పార్టీకి వెళ్లారు.. అక్కడ ఉద్యోగుల మధ్య ఎంత మందు కొడతాం అనే మాట వచ్చింది. 

ఈ క్రమంలోనే.. ఓ ఉద్యోగి.. మరో ఉద్యోగికి ఓ పందెం వేశాడు.. 10 నిమిషాల్లో.. పది అంటే పది నిమిషాల్లో.. ఒక లీటర్ మద్యం తాగాలి.. అది కూడా హాట్.. విక్కీ, బ్రాందీ, ఓడ్కా లాంటివి.. అలా తాగితే రెండు లక్షల రూపాయలు ఇస్తానని పందెం కాశాడు.. మామూలుగా అయితే లైట్ తీసుకోవచ్చు.. పందెం పెట్టినోడు 2 లక్షల రూపాయల క్యాష్ ను టేబుల్ పై పెట్టాడు.. అంతే.. అసలు సిసలు పందెం అప్పుడు మొదలైంది.

టేబుల్ పై 2 లక్షల డబ్బు.. ఇంకేముందీ.. ఓ ఉద్యోగి ముందుకు వచ్చాడు.. తనకు నచ్చిన విస్కీని.. ఓ లీటర్ బాటిల్ లో పోసుకున్నాడు.. సోడా, నీళ్లు కలుపుకోకుండానే పది అంటే పది నిమిషాల్లో తాగేశాడు.. 2 లక్షల క్యాష్ కూడా జేబులో వేసుకున్నాడు అతను.. గెలిచిన సంతోషంలో మరో పది నిమిషాలు గంతులేశాడు.. ఆనందంలో మరో రెండు పెగ్గులు కూడా లాగించేశాడు.. అంతే 22వ నిమిషం పబ్ లోనే కుప్పకూలిపోయాడు... వెంటనే అతన్ని  ఆసుపత్రికి తరలించారు, అక్కడ అతనికి తీవ్రమైన ఆల్కహాల్ పాయిజనింగ్, ఆస్పిరేషన్ న్యుమోనియా, ఊపిరాడకపోవటం, గుండె ఆగిపోవడం వంటివి ఉన్నట్లు నిర్ధారణ అయింది, 

వైద్యులు అతన్ని బ్రతికించడానికి తీవ్ర   ప్రయత్నాలు చేసినప్పటికీ అసుపత్రిలో చికిత్స పొందుతూ అతను  మరణించాడు. అయితే ఈ సంఘటన జరిగిన  జరిగిన మరుసటి రోజు కంపెనీ మూసివేయబడింది.  ప్రస్తుతం ఈ ఘటనపై షెంజెన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతని  మరణ వార్త నెటిజన్లను దిగ్భ్రాంతికి గురి చేసింది. కాగా ఈ ఏడాదిలో  ఆన్‌లైన్ మద్యపాన యుద్ధంలో ఒక చైనీస్ లైవ్ స్ట్రీమర్ అతిగా మద్యం సేవించి మరణించాడు .