షాక్ అయిన ప్రపంచం: గాలి ఆడక 55 మంది సైనికులు మృతి

షాక్ అయిన ప్రపంచం: గాలి ఆడక 55 మంది సైనికులు మృతి

పసిఫిక్ మహా సముద్రంలోని తూర్పు చైనా సముద్రం వాయువ్య భాగమైన పసుపు సముద్రం(ఎల్లో సీ)లో అణు జలాంతర్గామి ఉచ్చులో చిక్కుకొని 55 మంది చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయారని యూకే రహస్య నివేదిక తెలిపింది. ఈ ఘటన ఈ ఏడాది ఆగస్టు 21( 2023 ఆగస్టు21)న జరిగిందని.. జలాంతర్గామిలో ఆక్సిజన్ వ్యవస్థ వైఫల్యం కారణంగానే సిబ్బంది సైనికులు మృతిచెందారని నివేదిక చెపుతోంది. ఈ దుర్ఘటనలో మరణించిన వారిలో చైనా PLA నేవీ సబ్‌మెరైన్ '093-417' కెప్టెన్, 21 మంది ఇతర అధికారులు ఉన్నారని డైలీ మెయిల్ తెలిపింది. 

యుఎస్ తో సహా దాని మద్దతు దేశాలకు సంబంధించిన జలాంతర్గాములను అడ్డుకునేందుకు చైనా నావికాదళం ఉపయోగించిన చైన్ , యాంకర్ ను జలాంతర్గామి ఢీకొట్టిందని నివేదికలు చెపుతున్నాయి. దీంతో నౌకను రీపేర్ చేయాలంటే ఉపరితలానికి తీసుకురావడానికి కనీసం ఆరు గంటలు పట్టిందని.. జలాంతర్గామిలోని వ్యవస్థల వైఫల్యం..ఆక్సిజన్ సరఫరా కలుషితం కావడం వల్ల సిబ్బంది ఆక్సిజన్ అందక చనిపోయారని డైలీ మెయిల్ తెలిపింది. 

Also Read :- ఉద్యోగం వచ్చిందని.. పోస్టర్లు వేశాడు

అయితే ఈ ఘటనను చైనా అధికారికంగా ఖండించింది. జలాంతర్గామి అంతర్జాతీయ సహాయాన్ని కోరేందుకు కూడా నిరాకరించినట్లు తెలుస్తోంది. మృతుల్లో 22 మంది అధికారులు, 7 మంది ఆఫీసర్ క్యాడెట్లు, 9 మంది చిన్న అధికారులు, 17 మంది నావికులు ఉన్నారు.