కరోనా వైరస్ పుట్టుక, మరణం గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా కరోనా వైరస్ 20డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ లో 20 సంవత్సరాల పాటు జీవిస్తుందని సైంటిస్ట్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిగ్గా మారాయి.
టైమ్స్ న్యూస్ నౌ కథనం ప్రకారం..చైనా హాంగ్ జౌ లో కరోనా పుట్టుక, మరణం గురించి జరిగిన సమావేశంలో చైనాకు చెందిన ప్రముఖ ఎపిడెమియాలజిస్ట్, చైనా దేశ కరోనా వైరస్ నిపుణుల బృంద సభ్యుడు ప్రొఫెసర్ లి లంజు వాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ చలికి భయపడదు. వైరస్ మైనస్ నాలుగు డిగ్రీల సెల్సియస్ లో కొన్ని నెలల పాటు, మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ లో 20 సంవత్సరాల పాటు జీవిస్తుందని సూచించారు. వైరస్ కు కారణమైన పచ్చి మాంసం, చేపల్ని తినడం మానేయాలని హెచ్చరించారు.
వుహాన్ మార్కెట్ నుంచి కరోనా వైరస్ పుట్టుకొచ్చినట్లు ఆధారాలున్నాయని, కాబట్టి నాన్ వెజ్ ఐటమ్ లను రవాణా చేయకుండా ఆంక్షలు విధించాలన్నారు.
మరో వైపు బీజింగ్ లో వ్యాపిస్తున్న కరోనా వైరస్ యూరప్ దేశాల్లో వ్యాపిస్తున్న వైరస్ కంటే చాలా పాతదని చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) కు చెందిన సైంటిస్ట్ వు జున్యు తెలిపారు.
నాన్ వెజ్ ఐటమ్స్ రవాణా నిలిపి వేయకపోతే వైరస్ బీజింగ్ నుంచి యూరప్ కు యూరప్ నుంచి చైనాకు తిరిగి వచ్చే అవకాశం ఉందని హాంకాంగ్ యూనివర్సిటీ సైంటిస్ట్ బెన్ కౌలింగ్ అన్నారు.
అయితే ప్రజలకు సీ ఫుడ్ తినొద్దని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ .. నాన్ వెజ్ తింటే కరోనా సోకదన్న ఆధారాలు తమవద్ద లేవని చైనా అధికారులు తెలిపారు.
