వైద్యచరిత్రలో సరికొత్త అధ్యాయం.. విరిగిన ఎముకలను కేవలం 3నిమిషాల్లోనే అతికించే బోన్ గ్లూ

వైద్యచరిత్రలో సరికొత్త అధ్యాయం.. విరిగిన ఎముకలను కేవలం 3నిమిషాల్లోనే అతికించే బోన్ గ్లూ

వైద్య చరిత్రలో సరికొత్త అధ్యాయం.. కేవలం మూడు అంటే మూడు నిమిషాల్లో విరిగిన ఎముకలను చక్కగా అతికించే గమ్.. బోన్ గ్లూ బోన్ 02..ఇప్పటివరకు ఎముకలు విరిగితే సిమెంట్ పట్టీ, మెటల్ ఇంప్లాంటేషన్ ద్వారా చికిత్స జరుగుతోంది. బోన్ విరిగి అతుక్కొని వ్యక్తి సాధారణంగా తిరగాలంటే కనీసం నెలరోజుల సమయం పట్టేది.. అప్పటికీ బోన్ సరిగ్గా అతుకుతుందా అంటే కొన్ని సందర్భాల్లో గ్యారంటీ లేదు..అయితే ఇప్పుడంత సమయం అవసరం లేదు. బోన్ గ్యారంటీగా అతుకుతుంది..ఎలా అంటే బోన్ గ్లూ ద్వారా.. ఈ ఎముకలు అతికించే గమ్ ను చైనీస్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. క్లినికల్ ట్రయల్స్ లో సక్సెస్ అయింది. వివరాల్లోకి వెళితే.. 

విరిగిన ఎముకలను కేవలం మూడు నిమిషాల్లోనే సరిచేయగల బోన్ 02 అనే విప్లవాత్మక బోన్ జిగురును అభివృద్ధి చేశారు చైనా శాస్త్రవేత్తలు. నీటి అడుగులో బ్రిడ్జీలకు అంటుకునే గుల్లల శక్తినుంచి ప్రేరణ పొంది చైనా శాస్త్రవేత్తలు ఈ బోన్ జిగురును తయారు చేశారు. ఈ జిగురు సహజంగా శరీరం ద్వారా శోషణం అవుతుంది. దీనికి తొలగించేందుకు ఆపరేషన్ అవసరం లేదు. 

►ALSO READ | మయన్మార్ స్కూళ్లపై వైమానిక దాడి.. 19 మంది విద్యార్థులు మృతి..

150 మందికి పైగా రోగులపై జరిపిన ట్రయల్స్ సక్సెస్ అయ్యాయి. ఇది మెటల్ ఇంప్లాంట్‌లను ఖచ్చితంగా భర్తీ చేస్తుంది. ఈ బోన్ జిగురుతో ఇన్ఫెక్షన్ ప్రమాదాలను చాలా తక్కువ అంటున్నారు శాస్త్రవేత్తలు. 

బోన్ 02 బోన్ గ్లూగా పిలువబడే ఈ ప్రాడక్టును తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లో ఓ పరిశోధనా బృందం బుధవారం ఆవిష్కరించిందని గ్లోబల్ టైమ్స్ నివేదిక చెబుతున్నాయి. సర్ రన్ రన్ షా ఆస్పత్రి హెడ్, అసోసియేట్ చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ అయిన లిన్ జియాన్‌ఫెంగ్ ఈ జిగురు తయారి గురించి వివరించారు. నీటి అడుగున వంతెనకు గట్టిగా అతుక్కున్న గుల్లలను నుంచి ప్రేరణ పొంది ఈ ప్రాడక్టును అభివృద్ధి చేశామని చెబుతున్నారు జియాన్ ఫెంగ్.

లిన్ చెబుతున్నదాని ప్రకారం.. రక్తం అధికంగా ఉండే వాతావరణంలో కూడా ఈ జిగురు రెండు లేదా మూడు నిమిషాల్లో గాయాన్ని సరిచేయగలదు. ఎముక నయం అయినప్పుడు జిగురును శరీరం సహజంగా గ్రహిస్తుందట. ఈ జిగురును తొలగించేందుకు ఆపరేషన్ అవసరం లేదంటున్నారు లిన్. 

గ్లోబల్ టైమ్స్ రిపోర్టు ప్రకారం.. ఈబోన్ జిగురు సేఫ్టీ ప్రమాణాలపై పరీక్షలు సక్సెస్ అయ్యాయి. క్లినికల్ ట్రయల్ లో కేవలం 180 సెకన్లు లేదా మూడు నిమిషాల్లో అతికించే ప్రక్రియ పూర్తయింది. ఈ బోన్ చిగురును 150 మందికి పైగా రోగులపై పరీక్షించారు.