Singer చిన్మయి Cyber Complaint.. ఫిర్యాదుపై స్పందించిన హైదరాబాద్ సీపీ సజ్జనార్

Singer చిన్మయి Cyber Complaint.. ఫిర్యాదుపై స్పందించిన హైదరాబాద్ సీపీ సజ్జనార్

హైదరాబాద్: సింగర్ చిన్మయి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా ప్లా్ట్ఫాం అయిన ‘X’లో కొందరు తనను, తన పిల్లలను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ట్రోల్ చేస్తున్న ఓ పది అకౌంట్స్ గురించి హైదరాబాద్ సీపీ సజ్జనార్కి Tag చేసింది. సజ్జనార్ ఆమె ఫిర్యాదుపై స్పందించి.. ‘X’లోనే తెలంగాణ పోలీసులను ట్యాగ్ చేసి ఆమె ఫిర్యాదుపై విచారణ చేయాలని ఆదేశించారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న తెలంగాణ పోలీసులు, సైబర్ క్రైం చిన్మయిని ఎవరు ట్రోల్ చేశారనే విషయంపై ఫోకస్ చేశారు. ట్రోల్ చేసిన వారి సోషల్ మీడియా ఖాతాలపై నిఘా పెట్టారు. 

తెలుగు, తమిళ భాషల్లో తన గొంతుతో.. తన పాటలతో ప్రేక్షకులకు సుపరిచితురాలైన సింగర్ చిన్మయి శ్రీపాద (Chinmayi Sripaada) మహిళల భద్రత, సాధికారత, స్త్రీ హక్కులకు భంగం కలిగితే స్పందించడంలో ఎప్పుడూ ముందుంటుంది. సమాజంలో ఆడవాళ్లకు ఏ సమస్య వచ్చిన..బయట మానవ మృగాల చేతిలో ఎవరైనా అఘాయిత్యానికి గురైన..సోషల్ మీడియాలో చిన్మయి స్పందిస్తుంది. కొన్నిసార్లు ఆమె స్పందించడం వల్ల జరిగిన ఇష్యూ ఏదైనా.. క్షణాల్లో వైరల్ అయిపోయి.. అందరూ రియాక్ట్ అయ్యేలా చేస్తోంది.