తిరుమల : రాష్ట్రంలో ఆలయాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు చిన్నజీయర్ స్వామి. అభిషేక సేవలో తిరుమల శ్రీవారిని….చిన్నజీయర్ స్వామి దర్శించుకున్నారు. విభజన తర్వాత ఏపీలో దేవాదాయశాఖ ఆధీనంలో 4 లక్షల 60వేల ఎకరాల భూమి ఉందని తెలిపారు. దేవాలయాలను పరిరక్షించాల్సిన వాళ్లు …ఆ బాధ్యతను సరిగ్గా నిర్వహించడం లేదని విమర్శించారు. పర్యవేక్షణ లోపం కారణంగానే రాష్ట్రంలోని పలు ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు. రాయలసీమలో దాడులు జరిగిన 27 ఆలయాలను పరిశీలించానని.. .ఈ ఆలయాంలోని 17 ఆలయాలలో అభివృద్ధికి తీసుకోవాల్సిన పలు సూచనలతో వినతి పత్రాన్ని టీటీడీ చైర్మన్ కి అందించామన్నారు. ఏపీలో ఆలయాలను అభివృద్ధి చేయాలని కోరారు చిన్న జీయర్ స్వామి.
