రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో ఉంది

రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో ఉంది

వ్యవసాయం సంక్షోభంలో ఉందన్నారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి. శనివారం  మీడియాతో ఆయన  మాట్లాడారు. రైతు పండించించిన ప్రతీ గింజను కొంటామని సీఎం కేసీఆర్ అన్నారని...కానీ  ఎక్కడ కొనుగోలు జరగడం లేదన్నారు. ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం చేతులు ఎత్తేసిందన్నారు.

నల్గొండ, మిర్యాలగూడలో టోకెన్ తీసుకొని కోత చేసుకోవాల్సి వస్తోందన్నారు చిన్నారెడ్డి. నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ లో రేపు(మంగళవారం) కాంగ్రెస్ బృందాలు పర్యటిస్తాయని, రైతు సమస్యలు తెలుసుకోవడానికి 4 బృందాలు వెళుతాయని తెలిపారు. రైతులు, మార్కెట్ కమిటీలు, మిల్లర్లతో మాట్లాడతామని తెలిపారు. రిపోర్ట్ తయారు చేసి పీసీసీ ఆధ్వర్యంలో  వ్యవసాయ కమిషనర్‌కు అందిస్తామన్నారు. రైతులను నియంత్రిస్తే ఊరుకోమని, రబీ పంటను కూడా కొనాల్సిందేనని డిమాండ్ చేశారు. ఖల్లాల్లో రైతులకు వసతులు ఏర్పాటు చేయాలని చిన్నారెడ్డి డిమాండ్ చేశారు.