ఇది నిజంగా వర్ణించలేని అనుభూతి.. రామమందిర ఆహ్వానంపై చిరు ఎమోషనల్ ట్వీట్

ఇది నిజంగా వర్ణించలేని అనుభూతి.. రామమందిర ఆహ్వానంపై చిరు ఎమోషనల్ ట్వీట్

అయోధ్య(Ayodhya)లో రామ మందిర(Ram Mandhir) ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. మరికొత్త గంటల్లో ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరుగనుంది. ఆ మధురక్షణాల కోసం యావత్ దేశం మొత్తం ఎదురుచూస్తోంది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా చాలా మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. అందులో టాలీవుడ్ నుండి మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కూడా ఉన్నారు. రామ మందిర ప్రారంభోత్సవానికి తనకు కూడా ఆహ్వానం అందడంపై భావోద్వేగానికి లోనయ్యారు చిరంజీవి. ఇందులో భాగాంగాగే ఎమోషనల్ ట్వీట్ చేశారు.

చరిత్ర సృష్టిస్తోంది.. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అరుదైన ఘటం ఇది. నిజంగా ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేను. అయోధ్యలో రామ్‌లల్లా పట్టాభిషేకాన్ని చూసేందుకు ఆ భగవంతుడిచ్చిన ఆహ్వానంగా భావిస్తున్నాను. ఐదు వందల ఏళ్ల భారతీయుల నిరీక్షణ ఫలించబోతున్న మహత్తర అధ్యాయం. ఆ అంజనా దేవి కుమారుడు హనుమంతుడే స్వయంగా ఈ భూలోక అంజనా దేవి కుమారుడు చిరంజీవికి ఈ అమూల్యమైన అవకాశాన్ని ఇచ్చినట్లుగా అనిపిస్తోంది. నాకు, నా కుటుంబ సభ్యులకు ఎన్నో జన్మల పుణ్యఫలం దక్కింది. గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి జీకి నా హృదయపూర్వక అభినందనలు. జై శ్రీరామ్.. అంటూ రాసుకొచ్చారు చిరంజీవి. ప్రస్తుతం చిరంజీవి చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.