మెగా ముహూర్తం ఫిక్స్.. మే 22 నుంచి సెట్స్‌‌కు చిరు, అనిల్ రావిపూడి సినిమా

మెగా ముహూర్తం ఫిక్స్.. మే 22 నుంచి సెట్స్‌‌కు చిరు, అనిల్ రావిపూడి సినిమా

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా యంగ్ డైరెక్టర్స్‌‌తో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టుల్లో నటిస్తున్నారాయన. ఇప్పటికే మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ పూర్తి చేసిన ఆయన.. నెక్స్ట్ ప్రాజెక్టును అనిల్ రావిపూడితో స్టార్ట్ చేశారు. ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈనెల 22 నుంచి ఈ మూవీ సెట్స్‌‌కు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. 

దీనికోసం హైదరాబాద్‌‌లో స్పెషల్ సెట్‌‌ను రెడీ చేస్తున్నారట.  చిరంజీవి నటిస్తున్న 157వ సినిమా ఇది. ఇందులో ఆయన వింటేజ్ లుక్‌‌లో కనిపించనున్నారని టాక్. అలాగే హీరోయిన్‌‌గా గత  కొన్నిరోజులుగా ప్రచారంలో ఉన్న నయనతారనే ఇందులో ఫైనల్ చేశారని సమాచారం. 

కొన్ని  రోజుల్లోనే అఫీషియల్ అనౌన్స్‌‌మెంట్ వచ్చే చాన్స్ ఉందని తెలుస్తోంది.  షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల  నిర్మిస్తున్న ఈ  చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.