
మెగాస్టార్ 67 వ పుట్టినరోజు వేడుకులను చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్‌లో అభిమానులు ఘనంగా జరిపారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ వేడుకలకు దర్శకుడు మెహర్ రమేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెగాస్టార్ పుట్టినరోజున ఈ సేవాకార్యక్రమాల్లో పాల్గొనడం తన అదృష్టమని అన్నారు. సినిమాల్లో సంపాదించిన డబ్బుని ఇలా సేవకార్యక్రమాల్లో ఖర్చు చేయడం, లక్షల మందిలో స్ఫూర్తి నింపడం చిరంజీవి ఒక్కరికే సాధ్యమైందని అన్నారు. పక్కన ఉండే వారికి సాయం చేయడం చిరంజీవి లక్షణమని, సేవ అనేది ఆయన బ్లడ్‌లోనే ఉందని కొనియాడారు. సేవ చేయడానికి కావాల్సింది డబ్బు కాదని, గుండె కావాలని అన్నారు.
ఈ వేడుకల్లో నటుడు నాగమహేష్ మాట్లాడుతూ... ఇవాళ తాను సినిమా నటుడిగా మాట్లాడుతున్నానంటే అది అన్నయ్య చిరు పెట్టిన బిక్ష అని అన్నారు. ఖైదీ నంబర్ 150 షూటింగ్ కు తాను వెళ్లి చిన్న పాత్ర చేస్తాననగానే .. దర్శకుడు వినాయక్ తో మాట్లాడి సినిమాలో వేషం ఇప్పి్ంచారని అన్నారు. ఈ సందర్భంగా చిరుకు కృతజ్ఞతలు తెలిపారు. మెగాస్టార్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నట్టుగా నాగమహేష్ తెలిపారు.