ఆ వ్య‌క్తి మా అమ్మ కాదు: మెగాస్టార్ చిరంజీవి

ఆ వ్య‌క్తి మా అమ్మ కాదు: మెగాస్టార్ చిరంజీవి

కరోనాపై పోరులో మెగాస్టార్‌ చిరంజీవి తల్లి అంజనాదేవి త‌న వంతు సాయంగా 700 మాస్క్‌లు తయారు చేసిందని మీడియాలో ప‌లు వార్తలు వ‌చ్చాయి. తన వృద్దాప్యాన్ని కూడా లెక్కచేయకుండా స్నేహితురాళ్లతో కలిసి మాస్క్‌లు కుట్టిందని, అవసరమైన వారికి వాటిని పంచిందన్న‌ వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఈ క‌థ‌నాల‌పై మెగాస్టార్ చిరంజీవి త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు.

మానవతా ధృక్పధంతో తన తల్లి ఈ పని చేశారంటూ ప‌లు మీడియా ఛానెళ్లలో వచ్చిందని… అయితే ఆమె తన తల్లి కాదని చిరంజీవి తెలిపారు. ఆమె ఎవరైనా… ఇంత గొప్ప కార్యక్రమంలో భాగస్వామి అయినందుకు మనస్పూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నానని చెప్పారు. కమ్మనైన మనసున్న ప్రతి తల్లి అమ్మేనంటూ ట్వీట్ చేశారు.