రాజకీయాల్లో మోటుగానే ఉండాలి.. సెన్సిటివ్​గా ఉంటే రాణించలేం: చిరంజీవి

రాజకీయాల్లో మోటుగానే ఉండాలి.. సెన్సిటివ్​గా ఉంటే రాణించలేం: చిరంజీవి

హైదరాబాద్, వెలుగు: రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి కీలక కామెంట్లు చేశారు. సెన్సిటివ్ గా ఉంటే రాజకీయాల్లో రాణించడం చాలా కష్టమని అన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని వైఎన్ఎం కాలేజీ అలూమ్నీ మీట్ లో చిరంజీవి పాల్గొని మాట్లాడారు. ‘‘రాజకీయాల్లో రాణించాలంటే మోటుగానే ఉండాలి. మాటలు అనాలి.. అనిపించుకోవాలి. ఒక దశలో రాజకీయాలు అవసరమా అనిపించింది.

రాజకీయాలకు పవన్ కల్యాణ్ తగినవాడు. అంటాడు.. అనిపించుకుంటాడు. ఏదో ఒక రోజు అత్యున్నత స్థానంలో ఉంటాడు” అని ఆయన అన్నారు. ‘‘ఇలాంటి కార్యక్రమాలకు నేను రావడం ఇదే తొలిసారి. వీళ్లు ఆహ్వానించినప్పుడు షూటింగ్ బిజీలో కుదురుతుందో లేదో అనుకున్నాను. నా పాత మిత్రులను కలవడానికి వచ్చాను” అని చెప్పారు.