జగన్తో మీటింగ్.. బాలయ్య వ్యాఖ్యలపై చిరంజీవి రెస్పాన్స్..

జగన్తో మీటింగ్.. బాలయ్య వ్యాఖ్యలపై చిరంజీవి రెస్పాన్స్..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సినీ ఇండస్ట్రీ సమస్యలపై చిరంజీవి బృందం కలవటానికి వెళ్లినప్పుడు అప్పటి సీఎం జగన్ అవమానించారని అసెంబ్లీలో కామినేని శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం చెప్పిన బాలకృష్ణ.. జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా చిరంజీవిపై బాలయ్య వ్యంగ్యంగా మాట్లాడారని అటు సినీ ఇండస్ట్రీతో పాటు ఇటు పొలిటికల్ సర్కిల్ లో కూడా చర్చనీయాంశంగా మారింది.

బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి స్పందించారు. బాలకృష్ణ వ్యంగ్యంగా మాట్టాడటాన్ని టీవీలో చూశా. టికెట్ల పెంపుపై కొందరు నిర్మాతలు నన్ను కలిశారు. సినిమా ఖర్చు పెరుగుతుండటంతో.. టికెట్లపెంపుపై ప్రభుత్వంతో మాట్లాడాలని నిర్మాతలు కోరడంతోనే చొరవ తీసుకున్నా. 

అప్పటి సీఎం వైఎస్ జగన్ ఆహ్వానం మేరకే నేను వెళ్ళాను.. జగన్ సాదరంగా నన్ను ఆహ్వానించారు. సినీ పరిశ్రమ ఇబ్బందులను జగన్ కు వివరించా. సమయం ఇస్తే అందరం వస్తామని చెప్పా. కోవిడ్ వల్ల అయిదుగురే రావాలని చెబితే పదిమందిమి వస్తామన్నా  సరేనన్నారు.. బాలకృష్ణకి ఫోన్ చేస్తే అందుబాటులోకి రాలేదు.. నేను గట్టిగా మాట్లాడితే జగన్ దిగివచ్చారన్నది అబద్ధం.. సీఎం అయినా, సామాన్యుడైనా నా సహజ ధోరణిలో గౌరవం ఇచ్చి పుచ్చుకునేలా మాట్లాడతా.. ప్రభుత్వం నిర్ణయం వలన సినీ పరిశ్రమకు మేలు జరిగింది. నా చొరవ వల్లే టికెట్ల రేట్లు పెరిగాయి. అందుకు అక్కడున్నవారంతా సాక్షులే. నా వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలకు టికెట్లు పెరిగాయి.. అని బాలకృష్ణ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు చిరు. 

బాలకృష్ణ ఏమన్నారు..?

ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ అసెంబ్లీలో చర్చల సందర్భంగా ఆ సైకోగాడు అంటూ కామెంట్స్ చేశారు. గతంలో చిరంజీవి బృందాన్ని కలవటానికి జగన్ నిరాకరించారన్న కామినేని శ్రీనివాసరావు వ్యాఖ్యలపై అభ్యంతరం చెప్పిన బాలకృష్ణ.. జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

ALSO READ : సినిమా వాళ్లు ఆ సైకో గాడిని కలవటానికి వెళ్లినప్పుడు : జగన్ను ఉద్దేశించి అసెంబ్లీలో బాలయ్య సంచలన వ్యాఖ్యలు

రాజకీయాలకు సంబంధంలేని ప్రభాస్, మహేష్ బాబు లాంటి వారితో జగన్ ను కలిసేందుకు చిరంజీవి బృందం వెళితే.. గేటు దగ్గరే అవమానించారని కామినేని తెలిపారు. జగన్ నిరాకరించడంతో చిరంజీవి గట్టిగా అడిగితే అప్పుడు కలవాడానికి వచ్చారని అన్నారు.

కామినేని వ్యాఖ్యలపై బాలకృష్ణ సీరియస్ అయ్యారు. సినిమా వాళ్లు ఆ సైకో గాడిని కలవాటినికి వెళ్లినప్పుడు... చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడన్నది అబద్ధం.. అంటూ ఫైరయ్యారు. ఎవడు అక్కడ గట్టిగా అడగలేదు.. ఆయనేదో గట్టిగా అడిగితే వచ్చాడట.. సినిమాటోగ్రఫీ మంత్రిని కలవమన్నాడట. ఎవడడిగాడు గట్టిగా.. అడిగితే వచ్చాడా.. అడగటం ఏంటి.. అని ప్రశ్నించారు.

 సినిమాటోగ్రఫీ లిస్ట్ తయారు చేయమని.. నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది.. నాపేరు 9వ వరుసలో పెట్టారు.. 9వ వరుసలో పెట్టడం ఏంటి..? వెంటనే అడిగాను.. ఎవడాడు వేసిందని.. కందుల దుర్గేష్ ను కూడా అడిగాను.. ఎవడాడు వేసిందని.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బాలయ్య.