
మెగాస్టార్ చిరంజీవితో కలిసి డ్యాన్స్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పింది బాలీవుడ్ హీరోయిన్ మౌనిరాయ్. చిరంజీవి హీరోగా వశిష్ట తెరకెక్కిస్తున్న ‘విశ్వంభర’చిత్రంలో ఆమె స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సాంగ్ షూటింగ్ సందర్భంగా సెట్స్‌లో చిరంజీవితో కలిసి ఆమె దిగిన ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గణేష్ ఆచార్య కొరియోగ్రఫీలో వందలమంది డ్యాన్సర్స్ మధ్య చిరంజీవి, మౌని రాయ్ జంటపై ఈ పాటను చిత్రీకరించారు. భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ రాశారు.
అయితే, ఈ పాటకోసం మౌనీ రాయ్ సుమారు రూ.50 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మౌనీ రాయ్.. నాగిణి సీరియల్‌తోనే చాలామందికి పరిచయం. ఈ పాటలో కూడా ఆమె నాగిణిగా కనిపించనుందన్న టాక్ వినిపిస్తోంది. ముందుగా ఈ పాటకు కరీనా కపూర్ అనుకోగా తాను రూ.8కోట్లు డిమాండ్ చేసిందట. ఇక చేసేదేం లేక మౌని రాయ్ తో ముగించినట్లు టాక్.
From the sets of #Vishwambhara @Roymouni poses with Megastar @KChiruTweets during a song shoot for Vishwambhara #Chiranjeevi #MouniRoy pic.twitter.com/hy4nP7n7gO
— Ramesh Pammy (@rameshpammy) July 30, 2025
ఇదిలా ఉంటే.. నిజానికి ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కానీ, ఈ ఒక్క పాటను భీమ్స్ చేసాడని సినీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇది కూడా మేకర్స్ ఆఫీషియల్గా చెప్పలేదు. టీమ్ దాచిపెడితే లీకైపోయింది. దీనిపై యువీ క్రియేషన్స్ సమర్థిస్తూ, ఖండిస్తూ ఎలాంటి ప్రకటన చేయలేదు.
మ్యాడ్, సంక్రాంతికి వస్తున్నాం లాంటి చిత్రాలకు తన మ్యూజిక్ ఎంతో ప్లస్ అయింది. ప్రస్తుతం చిరు- అనిల్ రావిపూడి చిత్రంతో పాటు మాస్ జాతర, డెకాయిట్, టైసన్ నాయుడు లాంటి చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడిక ‘విశ్వంభర’లో ఈ స్పెషల్ సాంగ్ వరుసలో చేరింది. మరి ఏరికోరి మెగాస్టార్ కోసం కంపోజ్ చేయిస్తున్న ఈ మాస్ సాంగ్ ఎలా మేజిక్ చేయబోతోందో అనే ఆసక్తి నెలకొంది.