#MEGA156: టైటిల్, కాన్సెప్ట్ వీడియో రిలీజ్.. ఫ్యాన్స్ కు పూనకాలే

#MEGA156: టైటిల్, కాన్సెప్ట్ వీడియో రిలీజ్.. ఫ్యాన్స్ కు పూనకాలే

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు సంక్రాంతి గిఫ్ట్ వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా బింబిసార(Bimbisara) ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో అత్యంత క్రేజీ ప్రాజెక్టు తెరకెక్కుతున్న  సంగతి తెలిసిందే. ఇటీవల ఈ మూవీ లాంచనంగా ప్రారంభమైంది.అప్పటి నుంచి  ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 

ఎట్టకేలకు ఫ్యాన్స్ ఎదురుచూపులకు తెరదించుతూ.. సంక్రాంతి కానుకగా జనవరి 15వ తేదీ సోమవారం  టైటిల్ తోపాటు ఈ మూవీ కాన్సెప్ట్ వీడియోను  మేకర్స్ విడుదల చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు విశ్వంభర అనే టైటిల్ ఖరారు చేశారు. కాన్సెప్ట్ వీడియోను చూస్తే.. మెగాస్టార్ కోసం  డైరెక్టర్ వశిష్ట ఒక కొత్త ప్రపంచాన్నే సృష్టించినట్లు అర్థమవుతోంది. వీడియోలో విజువల్ ఎఫెక్ట్స్ అదిరిపోయాయి. ఈ కాన్సెప్ట్ వీడియో ఊహించని విధంగా నెక్ట్స్ లెవల్ లో ఉంది. దీంతో మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ మెగా ప్రాజెక్టును యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌‌‌‌‌‌‌‌తో నిర్మిస్తోంది.ఫాంటసీ అడ్వెంచర్ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తయింది. నెక్స్ట్ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ను ఈ నెలాఖరులో లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి మొదలుపెడుతున్నారు.  చిరంజీవి నటిస్తోన్న 156వ చిత్రమిది. ఇందులో భీమవరం దొరబాబు అనే పాత్రను చిరంజీవి పోషిస్తున్నట్టు తెలుస్తోంది.  ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.