
టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ యాక్ష్ మూవీ ‘గణపథ్’. ‘ఎ హీరో ఈజ్ బోర్న్ అనేది క్యాప్షన్. కృతి సనన్ హీరోయిన్. అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. వికాస్ భల్ డైరెక్ట్ చేస్తున్నాడు. దసరా సందర్భంగా అక్టోబర్ 20న సినిమా విడుదల కానుంది. దీంతో ప్రచారంలో వేగం పెంచిన మేకర్స్.. శుక్రవారం టీజర్‌ను విడుదల చేశారు. తెలుగు వెర్షన్ టీజర్‌ను చిరంజీవి సోషల్ మీడియా ద్వారా విడుదల చేసి, టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.
ఇక టీజర్ ఓపెన్ చేయగానే.. అది 1970 సంవత్సరం. తినే తిండి కోసం కొట్టుకునే మనుషులు. ఎలాంటి ఆశ, జాలి లేని ప్రపంచం. మన కోసం ఒక వీరుడు వచ్చేంతవరకూ ఈ యుద్ధం మొదలుపెట్టొద్దు అంటూ ఒక వాయిస్. ఆ వీరుడుగా యాక్షన్ సీన్స్‌లో కనిపించాడు టైగర్ ష్రాఫ్. కృతి సనన్ కూడా ఫైట్స్ చేస్తూ కనిపించింది. ఓ ఆధ్యాత్మిక గురువు తరహాలో డిఫరెంట్ లుక్‌లో కనిపించారు అమితాబ్. ఫ్యూచరిస్టిక్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యాక్షన్ డ్రామా ఇదని టీజర్‌ను బట్టి అర్థమవుతోంది.