చిట్యాల సమీపంలో రోడ్డు ప్రమాదం.. స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

చిట్యాల సమీపంలో రోడ్డు ప్రమాదం.. స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

చిట్యాల, వెలుగు: చిట్యాల సమీపంలోని గుండ్రంపల్లి వద్ద సోమవారం రోడ్డు దాటుతున్న వ్యక్తిని బైక్ ఢీకొనడంతో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. అదే సమయంలో నల్గొండ నుంచి హైదరాబాద్‌‌కు వెళుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గమనించి కాన్వాయ్‌‌ను వెంటనే ఆపేశారు.

బాధితులను అంబులెన్స్ ద్వారా నార్కట్ పల్లి ఆసుపత్రికి తరలించారు. వైద్యులతో మాట్లాడి గాయపడిన వారికి అత్యవసర చికిత్స అందించాలన్నారు. ప్రమాదం వివరాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.