
తమిళ స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా చేస్తున్న మూవీ ధ్రువనక్షత్రం. దాదాపు మూడు సంవత్సరాల క్రితం మొదలైన ఈ సినిమా.. ఇప్పటికీ కంప్లీట్ అవలేదు. అసలు ఈ సినిమా విడుదల అవుతుందా అనే అనుమానాలు కూడా వచ్చాయి. అయితే ఈ సినిమా నుండి తాజాగా ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అదేంటంటే.. ఈ సినిమాను జూన్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట మేకర్స్. ఇటీవలే దర్శకుడు గౌతమ్ మీనన్ చిత్రం సినిమాకు సంబందించిన ప్యాచ్ వర్క్ షూటింగ్‌ను కంప్లీట్ చేసినట్లు సమాచారం.
ఐశ్వర్య రాజేష్, రీతు వర్మ, సిమ్రాన్, పార్తీపన్, వినాయకన్, దివ్యదర్శిని, అర్జున్‌దాస్, వంశీకృష్ణ, రాధిక శాస్త్రకుమార్, మాయా ఎస్.కృష్ణన్, అభిరామి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు.విక్రమ్ డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తున్న ఈ సినిమా రిలీజ్ కు సంబంధించి అధికారికా ప్రకటన రావాల్సి ఉంది.