చాక్లెట్ కవర్లలో రూ. 6 కోట్ల డైమండ్స్

చాక్లెట్ కవర్లలో రూ. 6 కోట్ల డైమండ్స్

శంషాబాద్, వెలుగు: చాక్లెట్ కవర్లలో దాచి విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న రూ. 6 కోట్ల విలువైన డైమండ్స్ ను శంషాబాద్ ఎయిర్ పోర్టులో అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్‌‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు శుక్రవారం దుబాయికి వెళ్లేందుకు శంషాబాద్‌‌ ఎయిర్‌‌పోర్టుకు వచ్చారు. ఎయిర్ పోర్టు వద్ద వారి ప్రవర్తనపై అనుమానం రావడంతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు తనిఖీ చేశారు. 

దీంతో చాక్లెట్ కవర్లలో కాగితాలు చుట్టి ప్యాక్ చేసి ఉంచిన డైమండ్స్ వారి వద్ద దొరికాయి. వీటితోపాటు రూ. 9.83 లక్షల విలువైన ఫారిన్ కరెన్సీ, రూ. లక్ష ఇండియన్ కరెన్సీని కూడా వారి నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డైమండ్స్, కరెన్సీకి సంబంధించి సరైన ఆధారాలు చూపకపోవడంతో వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నామని డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. దీనిపై విచారణ కొనసాగుతోందని తెలిపారు.