చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ కు కరోనా

చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ కు కరోనా

 

  • నిన్న మాస్కు ధరించకుండానే కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కరీంనగర్: చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కు కరోనా నిర్ధారణ అయింది.నిన్న కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ సందర్భంగా ఆయన మాస్కులు ధరించలేదు. లైట్ తీసుకున్నట్లు వ్యవహరించారు. ఇవాళ అనుమానంతో పరీక్షలు చేయించుకోడా కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఆయన వెంటనే స్పందించి హోం ఐసొలేషన్ పాటిస్తున్నట్లు ప్రకటించారు.   తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

ఏదైనా అత్యవసర పని ఉంటే ఫోను ద్వారా సంప్రదించాలని కోరారు. మాస్కులు,శానిటైజర్ లు విధిగా వాడాలని సూచించారు.ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. నిన్న నియోజకవర్గంలో జరిగిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో మాస్క్ లేకుండా పాల్గొన్న ఎమ్మెల్యే రవిశంకర్.. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో దళితబంధు లబ్దిదారులకు వాహనాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్, ఇతర నేతలు అధికారులతో కలిసి పాల్గొన్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రవిశంకర్ 24 గంటలు తిరగకముందే కరోనా బారినపడ్డారు.  

 

ఇవి కూడా చదవండి

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ తోపాటు ఆరుగురికి కరోనా

ఆస్కార్ రేసులో రెండు సౌతిండియన్ సినిమాలు

విశ్లేషణ: నేర చరితులను రాజకీయాల నుంచి వెలి వేయాలి

ఆన్​లైన్​ అడిక్షన్.. పెరుగుతున్న ఫ్రస్ట్రేషన్