హెల్త్ సెంటర్ లో డాక్టర్ తోపాటు ఆరుగురికి కరోనా

హెల్త్ సెంటర్ లో డాక్టర్ తోపాటు ఆరుగురికి కరోనా

అదిలాబాద్ జిల్లాలో కరోనా కేసులు విజృంబిస్తున్నాయి. మహారాష్ట్ర సరిహద్దుని ఆనుకుని ఉన్న ఈ జిల్లాలో మొదటి నుంచి కేసుల పెరుగుదల భారీగానే ఉంది. అయితే గత కొద్ది రోజులుగా మళ్లీ పెరుగుతున్నాయి. ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదన్న ప్రచారంతో ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగింది. ఎంతగా జరిమానాలు విధిస్తున్నా ప్రజలు మాస్కులు ధరించకుండా.. సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడం వల్ల కేసులు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా కరోనా కేసుల పెరుగుతున్న నేపథ్యంలో తాంసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఒక డాక్టర్ స్వల్ప అస్వస్థతకు గురికావడంతో అనుమానంతో పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్ కు కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో అక్కడ పనిచేస్తున్న వైద్య సిబ్బంది అందరికీ పరీక్షలు చేయించగా.. ఆరుగురికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఇవాళ శనివారం ఆసుపత్రికి తాళం వేశారు. 
ఆసుపత్రి మొత్తం శానిటైజేషన్
  తాంసి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో  పనిచేస్తున్న డాక్టర్ సహా ఆరుగురికి కరోనా సోకడంతో ఆసుపత్రిలో వైద్య సేవలు తాత్కాలికంగా నిలిపివేశారు. డిస్ ఇన్ ఫెక్షన్ చేసేందుకు ఆసుపత్రి మొత్తం శానిటైజ్ చేయడంతోపాటు పరిసరాలను శుభ్రం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. 

 

ఇవి కూడా చదవండి

ఆస్కార్ రేసులో రెండు సౌతిండియన్ సినిమాలు

విశ్లేషణ: నేర చరితులను రాజకీయాల నుంచి వెలి వేయాలి

ఆన్​లైన్​ అడిక్షన్.. పెరుగుతున్న ఫ్రస్ట్రేషన్