ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

బోయినిపల్లి,వెలుగు: రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకుంటామని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. సోమవారం బోయినిపల్లిలో కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్​కార్డులను లబ్ధిదారులకు  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు కావడంలేదన్నారు. చాలా వస్తువులపై జీఎస్టీ పెంచడం దారుణమన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ ను ప్రజలు మరోసారి ఆదరించాలన్నారు. మండలంలో కొత్తగా 1,300 పింఛన్లు మంజూరయ్యాయని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వేణుగోపాల్, జడ్పీటీసీ ఉమ, ఎంపీడీఓ రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. 

ఎల్లారెడ్డిపేట బంద్ సక్సెస్

బీజేపీ, ఏబీవీపీ లీడర్ల ముందస్తు అరెస్ట్
ఎల్లారెడ్డిపేట,వెలుగు: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీ యాక్ట్ నమాదు చేసి జైలుకు పంపడాన్ని నిరసిస్తూ సోమవారం నిర్వహించిన ఎల్లారెడ్డిపేట మండల బంద్ విజయవంతమైంది. ఎల్లారెడ్డిపేట హిందూ సంఘాల ఐక్యవేదిక పిలుపుమేరకు మండల కేంద్రంతోపాటు రాచర్ల, గోల్లపల్లి, బోప్పాపూర్, వెంకటాపూర్, అల్మాస్ పూర్ గ్రామాల్లో వ్యాపార, వాణిజ్య సంస్థల నిర్వాహకులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. దీంతో రోడ్లన్నీ బోసిపొయి కనిపించాయి. మంత్రి కేటీఆర్ ఇలాకాలో బంద్ కు పిలుపునివ్వడంతో అప్రమత్తమైన పోలీసులు ముందస్తుగా బీజేపీ, ఏబీవీపీ లీడర్లను అరెస్టు చేశారు. సీఐ మొగిలి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

బీజేపీ పార్లమెంటరీ కన్వీనర్ల నియామకం

సిరిసిల్ల కలెక్టరేట్, వెలుగు: బీజేపీ కరీంనగర్ పార్లమెంటరీ కో కన్వీనర్ గా సిరిసిల్ల మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడేపు రవీందర్ నియామాకమయ్యారు. సోమవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ నియామాక పత్రాన్ని అందించి సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాకాంత్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు రాజు, కౌన్సిలర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.  
నిజామాబాద్ జాయింట్​ కన్వీనర్ గా సదాశివ్ మెట్ పల్లి: నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ జాయింట్ కన్వీనర్ గా మెట్ పల్లి పట్టణానికి చెందిన బీజేపీ లీడర్​గుంటుక సదాశివ్ నియామకమయ్యారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గేళ్ల ప్రదీప్ కుమార్ సోమవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. 

పెద్దపల్లి కన్వీనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మల్లికార్జున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
గోదావరిఖని: బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గం కన్వీనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా గోదావరిఖనికి చెందిన పి.మల్లికార్జున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నియమించారు. ఈమేరకు సోమవారం స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ దుగ్యాల ప్రదీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకటన విడుదల చేశారు.

కన్వీనర్ ప్రవీణ్​రావుకు సన్మానం
కరీంనగర్ సిటీ: బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ గా నియామకమైన బోయినిపల్లి ప్రవీణ్ రావును ఎంపీ ఆఫీస్​లో బీజేపీ పశ్చిమ జోన్ అధ్యక్షుడు నరహరి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో లీడర్లు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో లీడర్లు బండ రమణారెడ్డి, సిద్ధి సంపత్, ప్రసన్నారెడ్డి, ప్రభాకర్ ఉన్నారు. 

నిందితుడిపై చర్యలు తీసుకోవాలి
గొల్లపల్లి, వెలుగు : స్థానిక యూనియన్ బ్యాంకు బిజినెస్ కరస్పాండెంట్ గా పనిచేస్తూ అక్రమాలకు పాల్పడిన బొమ్మ అంజయ్యపై చర్యలు తీసుకోవాలని ఇబ్రహీం నగర్ కు చెందిన బాధితులు సోమవారం రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఖాతాల నుంచి తీసిన డబ్బు వెంటనే జమ చేయాలని డిమాండ్ చేశారు. అంజయ్య పారిపోయి 20 రోజులు గడుస్తున్నా బ్యాంకు అధికారులు పట్టించుకోవడంలేదన్నారు. అంజయ్య మహిళా సంఘాల నుంచి రూ. కోటి, రైతులు, ఖాతాదారుల నుంచి మరో రూ.కోటి అపహారించినట్లు పేర్కొన్నారు. దీంతో బ్యాంకు మేనేజర్ శ్రీకాంత్ గ్రామస్తుల వద్దకు వచ్చి మూడు రోజులలో గ్రామానికి వచ్చి న్యాయం చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో సర్పంచ్ గంగారెడ్డి, ఎంపీటీసీ లక్ష్మణ్, ఏఎంసీ వైస్ చైర్మన్ గంగాధర్, నాయకులు పాల్గొన్నారు.

అప్పుడే పుట్టిన శిశువు మృతి
డాక్టర్ల నిర్లక్ష్యంతోనే అని కుటుంబీకుల ఆందోళన
గోదావరిఖని, వెలుగు : స్థానిక సింగరేణి ఏరియా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ బంధువులు సోమవారం ఆందోళన చేపట్టారు. బంధువుల కథనం ప్రకారం.. గోదావరిఖని జీడీకే 2వ గనిలో ఉద్యోగిగా పనిచేసే కనకయ్య కూతురు కనుకుంట్ల శివాని డెలివరీ కోసం సింగరేణి ఏరియా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంద్ర వద్ద ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకుంది. సోమవారం ఆడ శిశువు జన్మించింది. అయితే శిశువు ఆరోగ్యం బాగా లేదని కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రెఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. దీంతో శిశువును కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తీసుకెళుతుండగా పెద్దపల్లి సమీపంలో చనిపోయింది. శిశువు మృతికి డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు, సీఐటీయూ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టి.రాజిరెడ్డి తదితరులు హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద ఆందోళన చేశారు. హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని వార్డు అద్దాలను పగులగొట్టారు. సమాచారం తెలుసుకున్న గోదావరిఖని వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీఐ రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకుని విచారణ చేపట్టారు. శిశువు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో కరీంనగర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌రెఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశామని హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏసీఎంఓ డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు. దీంతో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కుటుంబ సభ్యులకు శాంతించారు. 

నిమజ్జనాలు ప్రశాంతంగా జరగాలి
కలెక్టర్ అనురాగ్, ఎస్పీ రాహుల్​

సిరిసిల్ల టౌన్​, వెలుగు : జిల్లాలో 9న జరగబోయే వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. వినాయక నిమజ్జన ఏర్పాట్లపై సోమవారం సిరిసిల్ల కలెక్టరేట్​లో ఆయన సమీక్ష నిర్వహించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో 580, వేములవాడ పరిధిలో 220 విగ్రహాలను ప్రతిష్ఠించారని అన్నారు. చెరువుల వద్ద గజ ఈతగాళ్లు అందుబాటులో ఉండేవిధంగా చూడాలన్నారు. సమావేశంలో ఎస్పీ రాహుల్ హెగ్డే, అడిషనల్​కలెక్టర్ ఎన్.ఖీమ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు. 

అల్ఫోర్స్ లెక్చరర్ పురుమళ్లకు డాక్టరేట్
కరీంనగర్ టౌన్, వెలుగు: అల్ఫోర్స్ ఉమెన్స్ కాలేజీ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్ మెంట్ లో  లెక్చరర్ గా పనిచేస్తున్న కొత్తయాశ్వాడకు చెందిన పురమళ్ల వెంకటేశ్వర్లుకు కాకతీయ యూనివర్సిటీ ఎగ్జామ్స్ కంట్రోలర్ పి.మల్లారెడ్డి డాక్టరేట్ ప్రకటించారు. సోమవారం కాలేజీ ఆవరణలో కరస్పాండెంట్ వి.నరేందర్ రెడ్డి, డాక్టర్ వెంకటేశ్వర్లును అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంప్యూటర్ సైన్స్ విభాగంలో డాక్టరేట్ సాధించడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో లెక్చరర్స్ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. 

బీజేపీ, కాంగ్రెస్ చేసిందేమీ లేదు;ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్​కుమార్​ 
గంగాధర, వెలుగు : సుమారు 70 ఏళ్లలో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిందేమీ లేదని -రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్​కుమార్​  అన్నారు. గంగాధర మండలం మంగపేటలోని ఓ ఫంక్షన్ హాల్​లో సోమవారం ఆసరా పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 50 లక్షల మందికి పింఛన్లు అందుతున్నాయన్నారు. పుట్టిన శిశువు నుంచి వృద్ధుల వరకు అందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని పేర్కొన్నారు.  కార్యక్రమంలో ఎమ్మెల్యే రవిశంకర్, ఎంపీపీ మధుకర్, జడ్పీటీసీ అనురాధ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు సురేందర్​రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. 

ఏ ప్రోగ్రాం చేసినా సమాచారం ఇవ్వట్లే!

ఎమ్మెల్యే ముందు నేలపై కూర్చొని జడ్పీటీసీ నిరసన 
బోయినిపల్లి, వెలుగు: మండలకేంద్రంలో ఏ ప్రోగ్రాం నిర్వహించినా తనకు సమాచారం ఇవ్వడం లేదని జడ్పీటీసీ సభ్యురాలు కత్తెరపాక ఉమ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోమవారం బోయినిపల్లిలో నిర్వహించిన రైతు వేదిక కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ ముందు నేలపై కూర్చొని నిరసన తెలిపారు. పలు కార్యక్రమాల సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలలో తన ఫొటో చిన్నగా వేస్తున్నారని, ఇది తెలిసి ఎమ్మెల్యే కూడా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను దళిత ప్రజాప్రతినిధి అయినందుకే మూడేళ్లుగా అవమానిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే ఇప్పుడు మాట్లాడటానికి ఇది సమయం కాదని, తర్వాత మాట్లాడుతానని సర్దిచెప్పడంతో జడ్పీటీసీ ఆందోళన విరమించారు.        .   

అడ్వకేట్లకు గొట్టిముక్కుల సంఘీభావం
పెద్దపల్లి, వెలుగు: స్థానిక కోర్టు ఆవరణలో అడ్వకేట్లు చేస్తున్న నిరసన దీక్షకు బీజేపీ సీనియర్ లీడర్​గొట్టిముక్కుల సురేశ్ రెడ్డి సోమవారం సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడ్వకేట్లు డిమాండ్ చేస్తున్న జిల్లా కోర్టును ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేశ్, అడ్వకేట్లు శిరీష, శ్రీనివాస్, రవి, రమేశ్​  పాల్గొన్నారు. 

సమాజ చైతన్యానికి ప్రేరణ టీచర్లే ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి
సిరిసిల్ల కలెక్టరేట్,వెలుగు :సమాజ చైతన్యానికి ప్రేరణ కల్పించేది టీచర్లేనని ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, నాఫ్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు అన్నారు. సోమవారం సిరిసిల్ల కలెక్టరేట్ లో డిస్ట్రిక్ లెవల్ బెస్ట్ టీచర్లను సన్మానించారు. అనంతరం వారు మాట్లాడతూ టీచర్లు తమ మేధోశక్తిని, విజ్ఞానాన్ని విద్యార్థులకు అందించి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. తాను 20 ఏళ్లు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నానని అది తనకెంతో సంతృప్తిని ఇచ్చిందని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు.కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ అరుణ, అడిషనల్ కలెక్టర్ ఖీమ్యానాయక్, డీఈఓ రాధాకిషన్ టీచర్లు పాల్గొన్నారు. 

హిందూ ధర్మాన్ని కాపాడడం అందరి బాధ్యత:బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ
కోనరావుపేట, వెలుగు :  హిందూ ధర్మాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. సోమవారం ఆయన కోనరావుపేటలో మాజీ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, బీజేపీ లీడర్లతో కలిసి వినాయక మండపంలో పూజలు చేశారు. కార్యక్రమంలో బీజేపి మండలాధ్యక్షుడు రామచంద్రం, జిల్లా కార్యదర్శి సురేందర్ రావు, ప్రధాన కార్యదర్శి తిరుపతి, మోహన్ పాల్గొన్నారు. 

బైండోవర్ ఉల్లంఘించిన వ్యక్తికి ఏడాది జైలు:మెట్ పల్లి ఎక్సైజ్ సీఐ రాధ
మెట్ పల్లి, వెలుగు : బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తికి ఏడాది జైలు శిక్ష పడినట్లు మెట్ పల్లి ఎక్సైజ్ సీఐ రాధ తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ కథలపూర్ గ్రామానికి చెందిన కుక్కదోవ గంగాధర్ ను గుడుంబా అమ్మకం కేసులో 13 డిసెంబర్ 2012లో తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశామన్నారు. బైండోవర్ కు విరుద్ధంగా గుడుంబా తయారు చేసినా, అమ్మినా రూ.లక్ష జరిమానా లేదా ఏడాది జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించామన్నారు. ఇటీవల గంగాధర్ గుడుంబా తయారు చేస్తూ దొరకడంతో తహసీల్దార్ రూ.లక్ష జరిమానా విధించారని సీఐ తెలిపారు. అయితే జరిమానా డబ్బులు కట్టకుండా పరారీలో ఉన్న గంగాధర్​ను సోమవారం అదుపులోకి తీసుకోగా తహసీల్దార్ ఏడాది జైలుశిక్ష విధించారని సీఐ రాధ తెలిపారు. దీంతో గంగాధర్​ను కరీంనగర్ జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు.