ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ గేమ్స్ ఆడేందుకు చోరీలు .. పోలీసులకు పట్టుబడ్డ యువకుడు

ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ గేమ్స్ ఆడేందుకు చోరీలు .. పోలీసులకు పట్టుబడ్డ యువకుడు

చొప్పదండి, వెలుగు: ఆన్​లైన్‌‌‌‌‌‌‌‌ గేమ్స్ ఆడుతూ డబ్బు కోసం చోరీలు చేస్తున్న ఓ యువకుడు పోలీసులకు పట్టుబడ్డాడు. ఎస్‌‌‌‌‌‌‌‌ఐ నరేశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి వివరాల ప్రకారం.. చొప్పదండి మండలం రాగంపేట గ్రామానికి చెందిన కొలిపాక మధు కుమార్(20) ఈజీగా మనీ సంపాదించేందుకు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో బెట్టింగ్​ యాప్స్‌‌‌‌‌‌‌‌కు అలవాటు పడ్డాడు. 

బెట్టింగ్‌‌‌‌‌‌‌‌ పెట్టేందుకు డబ్బు సరిపోకపోవడంతో ఈనెల 8న రాగంపేట గ్రామంలోని కొమురయ్య అనే వ్యక్తి ఇంట్లోకి వెళ్లి బీరువా తాళం పగలగొట్టి తులం బంగారం, రూ.22 వేల నగదు చోరీ చేశాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తించి శనివారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బంగారం, నగదు రికవరీ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్‌‌‌‌‌‌‌‌ఐ తెలిపారు.