కూలిన పాక్ ఆర్మీ హెలికాప్టర్

కూలిన పాక్ ఆర్మీ హెలికాప్టర్

సీనియర్ మిలటరీ అధికారులతో వెళుతున్న పాకిస్తాన్ ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. బలూచిస్తాన్ లోని విందర్ - సాస్సీ పున్నూ మందిరానికి మధ్య  ఈ ఘటన చోటు చేసుకుంది. తొలుత హెలికాప్టర్ అదృశమైందని వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని అధికారులు నిర్ధారించాల్సి ఉంది. బలూచిస్థాన్ లోని లాస్ బెలాలో వరద సహాయక కార్యక్రమాల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

కార్ప్స్ కమాండర్ 12తో సహా ఆరుగురు ఉన్నట్లు అధికారులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న అధికారులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. ఇందులో మిలటరీ కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ సర్పరాజ్ ఉన్నట్లు సమాచారం. వరద సహాయక చర్యల్లో ఉన్న పాక్ ఆర్మీ ఏవియేషన్ హెలికాప్టర్ ఏటీసీ తో సంబంధాలు కోల్పోయినట్లు పాక్ ఆర్మీ ట్వీట్ లో వెల్లడించింది. సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.