రివ్యూ : చోర్ బజార్ మూవీ

రివ్యూ : చోర్ బజార్ మూవీ

చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేసిన ఆకాష్ పూరి ఇప్పుడు సోలో హీరోగా సినిమాలు చేస్తున్నాడు. అవి కూడా యాక్షన్ సినిమాలు. ఆల్రెడీ రొమాంటిక్ మూవీతో ఫర్వాలేదు అనిపించుకున్నాడు. ఇప్పుడు పక్కా యాక్షన్ హీరోగా ‘‘చోర్ బజార్’’ అనే కమర్షియల్ సినిమా చేశాడు. ప్రమోషన్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మూవీ ఆకాష్ కు మాస్ ఇమేజ్ ను తెచ్చి పెట్టిందా ? లేదా ? అనేది చూద్దాం.

మూవీ కథ ఏంటంటే..?

ఈ సినిమా కథ విషయానికొస్తే.. హైదరాబాద్ లోని చోర్ బజార్ లో పుట్టి పెరుగుతాడు హీరో. అన్ని సామాన్లు దొంగలించి అక్కడే అమ్ముతుంటాడు.  ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ హీరోయిన్ కు ఆ పని నచ్చకపోవడంతో కారు షెడ్ లో పనిచేస్తుంటాడు. మరో వైపు మ్యూజియం నుంచి 200 కోట్ల విలువైన డైమండ్ మిస్ అయి చోర్ బజార్ లో పడుతుంది. దాని కోసం అటు పోలీసులు, ఇటు మాఫియా ముఠా ఆ బజార్ లో తిరుగుతుంటారు. మరి అంత విలువైన డైమండ్ ఎవరికి దొరుకుతుంది..? దానికి హీరోకి ఏంటి సంబంధం..? అనేది మిగతా కథ.

ఎలా ఉందంటే..?

చోర్ బజార్ రెగ్యులర్ కమర్షియల్ ప్యాకేజ్. కానీ అది కూడా సరిగా తీయలేకపోయాడు డైరెక్టర్.  పాయింట్ కమర్షియల్ సినిమాకు తగ్గట్టే బాగున్నా.. ఎగ్జిక్యూషన్ బాగాలేదు. సీన్ సీన్ కు మధ్య కనెక్టివిటీ లేదు. మేకింగ్ కూడా నాసిరకంగా ఉంది. దళం, జార్జిరెడ్డి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాతో నిరాశపరిచాడు. కమర్షియల్ ఎంటర్ టైనర్ పేరుతో తన శైలిలో లేని సినిమాను తీసి తప్పు చేశాడు. ఇదే కథను బాగా ప్లాన్ చేసి ఉంటే మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ తీయవచ్చు. కానీ బ్యాడ్ స్క్రీన్ ప్లే తో చెడగొట్టాడు డైరెక్టర్. ఫస్టాఫ్ బోరింగ్ గా సాగుతుంది. సెకండాఫ్ లో అక్కడక్కడా ఫర్వాలేదనిపించినా ఓవరాల్ గా ఆకట్టుకోలేకపోయింది.

నటీనటుల విషయానికి వస్తే..

ఆకాష్ పూరి లో మంచి ఫైర్ ఉంది. నటన పరంగా మెప్పించాడు.కానీ ఇలాంటి సినిమాలు చేసేందుకు తనకు ఇంకా టైమ్ ఉంది.స్క్రిప్టు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గెహనా సిప్పీ నటన బాగోలేదు. చూడ్డానికి కూడా యావరేజ్ గా ఉంది.సునీల్ కు తెలంగాణ స్లాంగ్ సూట్ అవ్వలేదు.సీనియర్ నటి అర్చన 25 ఏళ్ల తర్వాత ఈ సినిమానే ఎందుకు చేసిందో అర్థంకాదు.ఆ రోల్ ఎవరైనా చేయవచ్చు.తన ఫ్లాష్ బ్యాక్ లో అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ గా నటించిన సాంగ్ అస్సలు బాగాలేదు. చూడటానికి ఇబ్బందిగా ఉంది.సుబ్బరాజు కు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు.సంపూ కు అంత ఎలివేషన్ అవసరం లేదు.

టెక్నికల్ వాల్యూస్..

జగదీష్ సినిమాటోగ్రఫీ బాగుంది.  సురేష్ బొబ్బిలి పాటలు సినిమాకు హెల్ప్ అయ్యాయి.అన్నీ పాటలు బాగున్నాయి.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. ఎడిటింగ్ బాగోలేదు. ఆర్ట్ వర్క్ ,ప్రొడక్షన్ వాల్యూయ్స్ బాగున్నాయి. సిజి వర్క్ నాసిరకంగా ఉంది. డైలాగుల్లో బూతులు ఎక్కువున్నాయి. ఎక్కువ మ్యూట్ లు పడ్డాయి. థియేటర్లకు జనాలు రావడం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు నిలబడటం కష్టం. ఓటీటీలో కూడా సరైన ఆదరణ కు నోచుకోని మూవీ ఇది. మేకర్స్ మంచి కంటెంట్ ను ఇస్తే కానీ సినిమా ఆడదు. నటీనటుల పర్ఫార్మెన్స్ ,అక్కడక్కడా కొంత కామెడీ బాగున్నా ఓవరాల్ గా ఈ సినిమా డిసప్పాయింట్ చేస్తుంది.

రివ్యూ: చోర్ బజార్
రన్ టైమ్: 2 గంటల 5 నిమిషాలు
నటీనటులు: ఆకాష్ పూరి, గెహనా సిప్పీ, అర్చన, సుబ్బరాజు, సునీల్,సంపూర్ణేష్ బాబు తదితరులు
మ్యూజిక్: సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ: జగదీష్ చీకటి
నిర్మాత: వి.ఎస్.రాజు
రచన,దర్శకత్వం: జీవన్ రెడ్డి.బి
రిలీజ్ డేట్: జూన్ 24,2022