వెస్టిండీస్ టీమ్ ఇదే : వరల్డ్ కప్ లో గేల్, రసెల్

వెస్టిండీస్ టీమ్ ఇదే : వరల్డ్ కప్ లో గేల్, రసెల్

ఆంటిగ్వా: వరల్డ్ కప్ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తంది. క్వాలిఫై అయిన దేశాలు ఇప్పటికే తమ టీమ్ ను అనౌన్స్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వెస్టిండీస్ కూడా టీమ్ ప్లేయర్లను ప్రకటించింది. టీమ్ లో విధ్వంసక ప్లేయర్లు క్రిస్ గేల్, ఆండ్రూ రసెల్ కు అవకాశం దక్కింది. IPL లో అదరగొడుతున్న గేల్‌ (కింగ్స్‌ పంజాబ్‌), రస్సెల్‌ (కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌) టీమ్స్ లో అదరగొడుతున్నారు. ఈ మేరకే  వెస్టిండీస్‌ ప్రపంచకప్‌ టీమ్ లో చోటు దక్కించుకున్నారంటున్నారు స్పోర్ట్స్ అనలిస్టులు. అయితే.. జాసన్‌ హోల్డర్‌ కెప్టెన్సీలోని 15 మందితో కూడిన టీమ్ లో ఆల్ రౌండర్స్ పొలార్డ్‌, నరైన్‌ కు మాత్రం చుక్కెదురైంది. గేల్‌, రసెల్‌ లను మాత్రమే పరిగణలోకి తీసుకున్న విండీస్‌ క్రికెట్‌ బోర్డు.. పొలార్డ్‌, నరైన్‌ లను మాత్రం పక్కకు పెట్టింది.

వెస్టిండీస్‌ వరల్డ్‌ కప్‌ టీమ్ ఇదే..
హోల్డర్‌ (కెప్టెన్‌), క్రిస్‌గేల్‌, ఆష్లే నర్స్‌, రసెల్‌, కార్లోస్‌ బ్రాత్‌వైట్‌, డారెన్‌ బ్రావో, ఎవిన్‌ లూయిస్‌, ఫాబియన్‌ అలెన్‌, కీమర్‌ రోచ్‌, పూరన్‌ (వికెట్‌కీపర్‌), ఒషానె థామస్‌, షాయ్‌ హోప్‌, షానన్‌ గాబ్రియెల్‌, షెల్డన్‌ కొట్రెల్‌, హెట్‌మెయిర్‌.