కాలిన గురుతు.. ఈ క్రిస్మస్​ ట్రీ

కాలిన గురుతు.. ఈ క్రిస్మస్​ ట్రీ

ఆస్ట్రేలియాలో చెలరేగిన కార్చిచ్చు విషాదానికి గుర్తుగా సిడ్నీలో కాలిన క్రిస్మస్ ​ట్రీని ఏర్పాటు చేశారు. శుక్రవారం ఇక్కడ పిడుగు పడి చెలరేగిన మంటలు అడవులను దహించి వేశాయి. 700కు పైగా ఇండ్లు కాలిపోయాయి. 30 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి నాశనమైంది. ఈ ఘటనకు గుర్తుగా మంటల్లో కాలిపోయిన కట్టెలు, సైకిళ్లు, ఫైర్​ అలారమ్​లతో క్రిస్మస్​ట్రీని ఏర్పాటు చేశారు. ఈ ఘోర సంఘటనలో నిరాశ్రయులైన వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఫండ్​ రైజింగ్​లో భాగంగా ఈ ట్రీని ఏర్పాటు చేశామని రెడ్ ​క్రాస్ ​ప్రతినిధులు తెలిపారు. కార్చిచ్చు చెలరేగినప్పుడు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మోరిసన్ ​ఫ్యామిలీ ట్రిప్​లో ఉన్నారు. విషయం తెలిసిన ఆయన ట్రిప్​ను ముగించుకొన్నారు. ఆస్ట్రేలియాలోనే ఈ ఏడాది విషాదకరమైన సెలవు దినానికి చిహ్నంగా పేర్కొంటూ రెడ్​క్రాస్​ఈ ట్రీని ఏర్పాటు చేసింది.