టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. తన విలక్షణ నటనతో వెండితెరపై నవ్వులు పూయించే రాహుల్, ఇప్పుడు తన కుటుంబంలో జరిగిన ఒక హృదయ విదారక ఘటనతో కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన సోదరుడు 'పారాక్వాట్' (Paraquat) అనే అత్యంత ప్రమాదకరమైన గడ్డి నివారణ మందు కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద వార్తను పంచుకుంటూ రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియా వేదికగా చేసిన భావోద్వేగపూరిత పోస్ట్ చర్చనీయాంశమైంది. రాహుల్ సోదరుడు మరణ వార్త విని పలువురు సినీ ప్రముఖులు దిగ్భాంత్రిని వ్యక్తం చేశారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలిపారు.
పారాక్వాట్ మరణశాసనం
ఒక సామాన్య గడ్డి మందు ఒక నిండు ప్రాణాన్ని ఎలా బలితీసుకుంటుందో రాహుల్ తన ఆవేదనలో వివరించారు. పారాక్వాట్ అనేది వ్యవసాయంలో కలుపు మొక్కల నివారణకు వాడే రసాయనం. అయితే, దీనికి ఎటువంటి విరుగుడు (Antidote) లేకపోవడమే అతిపెద్ద శాపం మారింది. ఇది శరీరంలోకి వెళ్ళిన వెంటనే సైలెంట్ కిల్లర్‌లా పనిచేస్తుంది. ఈ రసాయనం రక్తంలో కలిసిన కొన్ని గంటల్లోనే ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. ఈ విషప్రయోగం వల్ల సంభవిస్తున్న మరణాల సంఖ్యను చూసి స్వయంగా వైద్యులే భయాందోళనకు గురవుతున్నారని రాహుల్ పేర్కొన్నారు. ఒక్కసారి ఇది శరీరంలోకి వెళ్తే, ఆధునిక వైద్యం కూడా చేతులెత్తేయాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వాలకు బహిరంగ విన్నపం
తన సోదరుడిని కోల్పోయిన పుట్టెడు దుఃఖంలోనూ, మరో కుటుంబానికి ఇలాంటి అన్యాయం జరగకూడదని రాహుల్ రామకృష్ణ ఒక సామాజిక బాధ్యతతో స్పందించారు. ఈ మేరకు ఆయన భారత ప్రధానమంత్రి కార్యాలయం (PMO) , తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయానికి (Telangana CMO) బహిరంగ లేఖ రాశారు. కేవలం వ్యవసాయ అవసరాల పేరుతో ఇంతటి ఘోరమైన విషం మార్కెట్‌లో, చివరికి ఈ-కామర్స్ సైట్లలో కూడా విచ్చలవిడిగా దొరుకుతోంది. ఇది ఆత్మహత్యలకు ఒక సాధనంగా మారుతోంది. తక్షణమే దీనిపై నిషేధం విధించాలి అని ఆయన డిమాండ్ చేశారు.
Honourable Sirs @TelanganaCMO @PMOIndia,
— Rahul Ramakrishna (@eyrahul) March 26, 2026
Lost my brother today to Paraquat poisoning. It’s terrifyingly lethal and widely misused for self-destruction. Shocked by how easily it is available everywhere. Doctors are overwhelmed by the amount of cases.Please ban it ASAP-save lives🙏🏽
మన దగ్గర ఎందుకు?
నిజానికి పారాక్వాట్ అనేది ప్రపంచవ్యాప్తంగా సుమారు 30కి పైగా దేశాల్లో ఇప్పటికే నిషేధించబడింది. చైనా, బ్రెజిల్ వంటి దేశాలు కూడా దీని ప్రమాదాన్ని గుర్తించి ఆంక్షలు విధించాయి. మన దేశంలో కూడా కేరళ వంటి రాష్ట్రాలు దీనిపై కఠినంగా వ్యవహరిస్తున్నాయి. అయినప్పటికీ, దేశవ్యాప్తంగా ఇది ఇంకా అందుబాటులో ఉండటం పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ రామకృష్ణకు మద్దతుగా సోషల్ మీడియాలో #BanParaquat అనే క్యాంపెయిన్ చేపట్టారు. రాహుల్ సోదరుడి మరణం కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు.. మన వ్యవస్థలో ఉన్న లోపాలకు నిదర్శనం మండిపడుతున్నారు.
Deepest condolences, Rahul.💔
— Sai Krishna (@TheStatScoop) March 27, 2026
Paraquat imports: +141% in 4 years (2019-20 to 2022-23). Domestic consumption: 105 MT in 2023-24.
Govt acknowledges the toxicity. 70+ countries including China have banned it. But, India's response? "use with caution, Improved packaging" over ban. pic.twitter.com/jLtzTXgR59
