పెళ్లిళ్ల పేరుతో ఆదివాసీ మహిళలను ఇబ్బంది పెడితే చర్యలు: మంత్రి సీతక్క

పెళ్లిళ్ల పేరుతో ఆదివాసీ మహిళలను ఇబ్బంది పెడితే చర్యలు: మంత్రి సీతక్క

పెళ్లిళ్ల పేరుతో ఆదివాసీ మహిళలను ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క అన్నారు. అసెంబ్లీలో మాట్లాడిన  ఆమె..  గత ప్రభుత్వం గ్రామాలను పట్టించుకోలేదన్నారు.   కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు.  

మిషన్ భగీరథలో తప్పులు సరిదిద్దుతున్నామని చెప్పారు సీతక్క.  మిషన్ భగీరథపై వరుస రివ్యూలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలపై గౌరవం పెంపొందించాలని .. క్లాస్ రూంల నుంచే మహిళలను గౌరవించేలా పాఠాలు నేర్పాలన్నారు. మహిళలు  స్వేచ్ఛగా పనిచేసుకునే విధానం కల్పిస్తున్నామని తెలిపారు సీతక్క. 

 ఇటీవల గ్రామీణ ప్రాంతాల్లో అమాయక ఆదివాసీ గిరిజన మహిళలకు డబ్బుల పేరిట ఆశచూపి కొందరు దళారులు వారిని మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలకు తరలించి విక్రయించడం కలకలం రేపింది.