Social Media Reels: రీల్స్ పిచ్చి అలా ఇలా లేదు.. ఏం చేస్తున్నామో సోయిలేకుండా తయారయ్యారు మనుషులు. బిడ్డతో బీచ్ కు వచ్చిన మొగుడు పెళ్లాం.. బిడ్డను వదిలేసి రీల్స్ చేసుకుంటూ ఉన్నారు.. సముద్రంలో అలల ఉధృతికి ఆ చిన్నారి కొట్టుకుపోతుంటే.. అక్కడే ఉన్న ఓ వ్యక్తి పరుగున వచ్చి పట్టుకున్నాడు.. ఇదంతా వీడియోలో రికార్డ్ అయ్యింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.. ఇంకేముందీ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.. పిచ్చండీ రీల్స్ పిచ్చి అంటూ నెటిజన్లు కామెంట్లతో విచుకుపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బిడ్డని గాలికి వదిలేసి రీల్స్ చేసిన కపుల్స్:
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఉన్న వారి పేర్లు మాత్రం బయటకు రాలేదు. వాళ్లు ఏ రాష్ట్రం వాళ్లు అనేది స్పష్టంగా తెలియరాలేదు. సోషల్ మీడియాలోని ఈ వీడియోను చూస్తే .. సముద్రపు బీచ్ దగ్గర ఎంజాయ్ చేయటానికి ఆ జంట తన బిడ్డతో వచ్చినట్లు ఉంది. తీరంలో నడుస్తూ ఉన్న వాళ్లు.. రీల్స్ చేయాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా మొగుడు రీల్ చేయటం కోసం తన మొబైల్ ఆన్ చేయగానే.. అప్పటి వరకు తన బిడ్డ చెయ్యి పట్టుకుని ఉన్న ఆ తల్లి.. బిడ్డ చెయ్యి వదిలేసి తన మొగుడి దగ్గరకు వస్తుంది. బిడ్డకు దూరంగా వస్తుంది.
అలల వేగానికి కొట్టుకుపోయిన చిన్నారి:
ఇదే సమయంలో సముద్రపు అల తీరాన్ని తాకుతుంది. ఆ వేగానికి ఆ బిడ్డ ముందుకు కొట్టుకువస్తుంది. తీరం వచ్చిన అల అంతే వేగంగా వెనక్కి లాగేయటం అనేది వెరీ కామన్. అలల్లో తేలాడుతున్న ఆ చిన్నారిని అలలు వెనక్కి లాగే సమయంలో.. ఆ పక్కనే ఉన్న ఓ వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి.. ఆ చిన్నారి చెయ్యి పట్టుకుంటాడు.
ఇంత జరుగుతున్నా.. ఆ మొగుడు పెళ్లానికి ఏమీ తెలియదు. రీల్స్ చేస్తూ వారి లోకంలో వాళ్లు ఉన్నారు. తీరానికి బలమైన అల వచ్చింది.. వెనక ఉన్న తన బిడ్డ సంగతి ఏంటీ అనే సోయి లేకుండా రీల్స్ చేస్తూ.. నవ్వుకుండా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియోలో వెనక చిన్నారిని కాపాడిన వ్యక్తి కూడా ఉంటాడు.
రీల్స్ చేసిన దంపతులపై నెట్టింట విమర్శలు:
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పిచ్చండీ ఇది రీల్స్ పిచ్చి. బిడ్డను సముద్రం దగ్గర వదిలేసి ఈ పిచ్చిచేష్ఠలు ఏంటీ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఆ మాత్రం సోయి లేకుండా ఉన్నప్పుడు బిడ్డను ఇంట్లోనే వదిలేసి రావొచ్చు కదా కొందరు నెటిజన్లు సలహా ఇస్తుంటే.. మరికొందరు మాత్రం ఇలాంటి బుద్ధిలేనోళ్లను ఏం చేసినా పాపం లేదు అంటూ మరికొందరు నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. ఈ వీడియో చూస్తుంటే ఇది నార్త్ ఇండియాలో జరిగిన ఘటనగా కొంత మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ జంటను చూస్తుంటే అలాగే ఉందని.. గుజరాత్ రాష్ట్రం అయ్యి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
आज Husband के साथ समुन्द्र पर घूमने गई थी जहाँ हमने देखा एक पति पत्नी Reel बनाने में इतने मगन थे अपनी बच्ची को पानी में ही छोड़ दिया। बच्ची समुन्द्र की लहरों में बहने से बच गई एक भय्या ने ध्यान दिया और बचा लिया। क्या अब Reel बाजी लोगों के लिए इतनी जरूरी हो गई है अपने बच्चों... Real news
— 𝗠𝗮𝗿𝗶𝘆𝗮𝗺_𝗠𝗕𝗗 (@Mariyam_MBD) October 19, 2026
