Sexual Allegations: జపాన్‌లోని నాగోయాలో జరుగుతున్న ఆసియా పారా గేమ్స్ 2026 (Asian Para Games 2026) లో పాల్గొనేందుకు వెళ్లిన భారత పారా ఈతగాడు మహ్మద్ షమ్స్ ఆలం షేక్ (Mohammad Shams Aalam Shaikh) తీవ్ర వివాదంలో చిక్కుకున్నాడు. హోటల్ మహిళా ఉద్యోగి పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడనే (Sexual Misconduct) ఆరోపణలపై జపాన్ పోలీసులు అతడిని విచారించి, దేశం నుంచి తిరిగి పంపించివేశారు. ఈ ఘటనతో పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా (PCI) తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. దేశ ప్రతిష్టకు భంగం కలిగించినందుకు గాను అతనిపై జీవితకాల నిషేధం (Lifetime Ban) విధించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.
హోటల్ రూమ్‌లో ఏం జరిగిందంటే:
* భారత పారా స్విమ్మింగ్ బృందం నాగోయాలోని ఫోర్ పాయింట్స్ బై షెరటాన్ (Four Points by Sheraton) హోటల్‌లో బస చేసింది.
* మహిళా ఉద్యోగి ఫిర్యాదు: సోమవారం రోజున హోటల్ హౌస్‌కీపింగ్ మహిళా ఉద్యోగి షేక్ ఉన్న గదిలోకి వెళ్లిన సమయంలో, అతడు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు ఆమెను తాకడానికి ప్రయత్నించాడని ఆరోపించింది.
* డిపోర్టేషన్: సదరు ఉద్యోగి వెంటనే గది నుంచి బయటకు వచ్చి హోటల్ మేనేజర్‌కు, జపాన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణ తర్వాత, షమ్స్ ఆలం షేక్‌ను మంగళవారం రోజునే జపాన్ నుంచి నేరుగా భారతదేశానికి పంపించేశారు. దీంతో అతడు పోటీపడాల్సిన రేసుల్లో పాల్గొనకుండానే వెనుతిరగాల్సిన పరిస్థితి నెలకొంది.
జీవితకాల నిషేధానికి పీసీఐ సన్నాహాలు:
38 ఏళ్ల షమ్స్ ఆలం షేక్ బీహార్ రాష్ట్రానికి చెందిన పారా ఈతగాడు. 2018 జకార్తా ఆసియా పారా గేమ్స్‌లో స్వర్ణ పతకాలు సాధించడంతో పాటు గతంలో ఎస్5, ఎస్‌బీ4 కేటగిరీల్లో ప్రపంచ నంబర్-1 ర్యాంకర్ గా కూడా నిలిచాడు. అయితే, అంతర్జాతీయ వేదికపై భారత క్రీడా రంగానికి చెడ్డ పేరు తీసుకువచ్చిన ఈ వ్యవహారంపై పీసీఐ క్రమశిక్షణా చర్యలకు దిగింది. తుది విచారణ నివేదిక ఆధారంగా అతనిపై లైఫ్‌టైమ్ బాన్ విధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ABSOLUTE SHAME, THIS IS UNACCEPTABLE!!😡 Indian para-swimmer Mohammad Shams Aalam Shaikh has reportedly been detained and deported from Japan following allegations of sexual misconduct involving a hotel staff member during the Asian Para Games 2026. The female staff member was reportedly carrying out his housekeeping duties when she was allegedly touched inappropriately by 40yo Aalam. This is deeply disturbing and completely unacceptable. The Paralympic Committee of India is reportedly considering a lifetime ban, pending a formal hearing. [India Today ]
— The Khel India (@TheKhelIndia) October 22, 2026
