హోటల్‌లో క్రిస్మస్ ట్రీ.. 107 కోట్ల వజ్రాలతో డెకరేషన్

హోటల్‌లో క్రిస్మస్ ట్రీ.. 107 కోట్ల వజ్రాలతో డెకరేషన్

ప్రపంచ వ్యాప్తంగా ప్రీ క్రిస్మస్ వేడుకలు మొదలైపోయాయి. డిసెంబరు 25న పండుగ ఉందగా.. దానికి నెల ముందు నుంచే క్రైస్తవులు ఘనంగా సంబరాలు స్టార్ట్ చేశారు. ఈ క్రిస్మస్ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా ప్రతి ఇంట్లో కనిపించేది క్రిస్మస్ ట్రీ. దీన్ని అందంగా డెకరేట్ చేసి.. పిల్లలకు సర్‌ప్రైజ్ గిఫ్టులు దానిలో ఉంచి ఇస్తారు.

జ్యావెలరీ, వజ్రాలతో.. ప్రపంచంలోనే కాస్ట్లీ క్రిస్మస్ ట్రీ

స్పెయిన్‌లోని ఓ రెస్టారెంట్ ఈ క్రిస్మస్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలని నిర్ణయించింది. క్రిస్మస్ ట్రీ డెకరేషన్‌తో దీన్ని స్టార్ట్ చేసింది కెంపిన్స్కీ హోటల్ బహియా. ప్రపంచంలోనే కాస్ట్లీ క్రిస్మస్ ట్రీని రూపొందించింది. డిసెంబర్ 1న డెకరేషన్ మొదలు పెడితే పూర్తి చేయడానికి రెండ్రోజులు పట్టింది. దీని అలంకరణకు రూ.107.33 కోట్ల విలువైన జ్యువెలరీ, వజ్రాలు, రత్నాలు వాడింది. పిక్, వైట్, బ్లాక్, రెడ్ డైమండ్స్‌తో దీన్ని డెకరేట్ చేశారు. అలాగే త్రీడీ ప్రింటెడ్ చాక్లెట్ బొమ్మలను దానిపై ఉంచారు.

MORE NEWS:

నిద్రపోవడమే జాబ్.. జీతం లక్ష: ఇండియన్స్ అంతా అప్లై చేసుకోవచ్చు

మా చివరి కోరిక తీర్చండి.. ఫ్యామిలీ అంతా సూసైడ్!

2010లో అబుధాబిలోని ఎమిరేట్స్ ప్యాలెస్ హోటల్ గిన్నిస్ రికార్డు కోసం రూ.78.7 కోట్ల విలువైన బంగారు నగలతో క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేసింది. ఇప్పుడు ఆ రికార్డును స్పెయిన్ హోటల్ బ్రేక్ చేసింది.