రాడిసన్ డ్రగ్స్ కేసు.. పార్టీకి వెళ్లిన వారికి ఆ పరీక్షలు

రాడిసన్  డ్రగ్స్ కేసు.. పార్టీకి వెళ్లిన వారికి ఆ పరీక్షలు

హైదరాబాద్ రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీకి వెళ్లిన వారిలో డ్రగ్స్ ను గుర్తించేందుకు సరికొత్త ప్రయోగానికి తెరలేపారు పోలీసులు. కేసులో క్రోమోటోగ్రఫీ పరీక్షలు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కూకట్ పల్లి కోర్టు అనుమతిని కోరారు పోలీసులు.

అయితే కూకట్ పల్లి కోర్టులో అనుమతి రాకపోవడంతో.. హైకోర్టును ఆశ్రయించారు. దీనికి హైకోర్టు అనుమతి ఇస్తే.. తెలుగు రాష్ట్రాల్లో మొదటి పరీక్ష క్రోమోటోగ్రఫీ అవుతుంది. ఈ పరీక్ష నిర్వహిస్తే.. డ్రగ్స్ తీసుకున్నవారు ఎవరనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. 

ఏం జరిగిందంటే..

రాడిసన్ హోటల్ లో 2024 ఫిబ్రవరి 24న డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు.. దాడులు నిర్వహించారు. పోలీసుల తనిఖీల్లో డ్రగ్స్ లభించాయి. ఆ పార్టీతో సంబంధం ఉన్నట్లుగా మొత్తం 14 మందిని పోలీసులు గుర్తించారు. వారిలో కేవలం ముగ్గురికి మాత్రమే డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది.

అయితే, ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురు సెలబ్రెటీలు పార్టీ జరిగిన చాలారోజులకు విచారణకు హాజరయ్యారు. దీంతో వారి నమూనాలో డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించలేదని పోలీసులు భావిస్తున్నారు. వారి శరీరాల్లో డ్రగ్స్ గుర్తించేందుకు క్రోమోటోగ్రఫీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు పోలీసులు.