
వినియోగదారులకు Google Chrome గుడ్ న్యూస్ చెప్పింది. క్రోమ్ ఓపెన్ చేసినపుడు తరుచుగా వచ్చే వెబ్ సైట్లను నుంచి వచ్చే నోటిఫికేషన్లను కట్టడి చేసేందుకు కొత్త ఫీచర్ ను తెచ్చింది. ఈ అప్‌డేట్ ఆండ్రాయిడ్, డెస్క్‌టాప్ వెర్షన్లు రెండింటికీ బ్రౌజర్‌లో అందుబాటులోకి వస్తుంది. ఇది తరచుగా బ్రౌజింగ్‌కు అంతరాయం కలిగించే పాప్-అప్ వార్నింగ్ నోటిఫికేషన్లను తగ్గించడంలో కస్టమర్లకు సాయపడుతుంది.
ఒక సైట్ తరచుగా నోటిఫికేషన్‌లను పంపినప్పుడు వాటిని మనం తిరస్కరించినట్లయితే అంటే మనం వాడని వెబ్ సైట్ల పాప్ అప్ నోటిఫికేషన్లు రాకుండా Chrome నియంత్రిస్తుంది. అయితే ఇది ఇన్‌స్టాల్ చేయబడిన వెబ్ యాప్‌లను వర్తించదు. ఎందుకంటే అవి అప్డేట్ లను అందించే అవకాశం ఉంటుంది.
ఈ మార్పు Chrome సెక్యూరిటీ చెక్ టూల్‌పై రూపొందించారు. ఇది ఇప్పటికే వాడకుండా ఉన్న వెబ్ సైట్ లనుంచి కెమెరా, లోకేషన్ అనుమతులను రద్దు చేసింది. ఇప్పుడు నోటిఫికేషన్లకు విస్తరించింది. వినియోగదారులకు అనవసరమైన నోటిఫికేషన్లను తగ్గించడం లక్ష్యంగా చేసుకొని Google ఈ ఫీచర్ ను తీసుకొచ్చింది.
Chrome సైట్ ఈ అనవసర వెబ్ సైట్ నోటిఫికేషన్లను రద్దు చేసినప్పుడు కస్టమర్లకు తెలియజేస్తుంది. సెక్యూరిటీ చెక్ ప్యానల్ ద్వారా లేదా నేరుగా సైట్ నుంచి వాటి నియంత్రణకు, కావాలనుకున్నపుడు ఆటోమేటిక్ క్యాన్సిల్ ఫీచర్ ను ఆఫ్ చేసే ఎంపిక కూడా ఉంది.
తమ కస్టమర్లు బ్రౌజింగ్‌ను ఎటువంటి ఆటంకం లేకుండా చేసుకునేందుకు వీలుగా Google ఈ కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. స్వయంగా అనవసర నోటిఫికేషన్లను నియంత్రించడం ద్వారా వినియోగదారులకు క్లీన్ ఎక్స్ పీరియెన్స్ ను అందించడంGoogle Chrome లక్ష్యం.