చేర్యాల మండలంలో ఫర్టిలైజర్​ షాపుల్లో తనిఖీలు

చేర్యాల  మండలంలో ఫర్టిలైజర్​ షాపుల్లో తనిఖీలు

చేర్యాల, వెలుగు: మండల కేంద్రంలోని పలు సీడ్స్​అండ్​ ఫర్టిలైజర్స్​షాపుల్లో సీఐ శ్రీను ఆధ్వర్యంలోని పోలీసుల బృందం, మండల వ్యవసాయాధికారులు కలిసి శనివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నకిలీ విత్తనాలు, పురుగుల మందులతో రైతులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు ఎరువులు, పురుగు మందులు, కొనేటప్పుడు తప్పకుండా రశీదు తీసుకోవాలని సూచించారు. 

స్టాక్​, డెలివరీ రిజిస్టర్లు, బిల్​బుక్​ రికార్డులను తనిఖీ చేసి షాప్​లో ఉన్న సీడ్స్​, ఫర్టిలైజర్​బస్తాలను పరిశీలించారు. రైతులు అప్రమత్తంగా ఉండి ఎరువులు, విత్తనాలు, పురుగు మందులను కొనాలని ఏదైనా అనుమానం వస్తే 100కు డయల్​చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏవో భోగేశ్వర్, ఏఈవో ప్రవీణ్​, రవలి, ప్రొహిబిషన్​ఎస్ఐ సమత పాల్గొన్నారు.

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

కోహెడ (హుస్నాబాద్): నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తప్పవని సీఐ శ్రీనివాస్​ హెచ్చరించారు. హుస్నాబాద్​లో  సీడ్స్, ఫర్టిలైజర్​ షాపులను ఏవో శ్రేయతో కలిసి తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ రైతులు విత్తనాలు, ఎరువులు కొనేటప్పుడు తప్పకుండా రశీదు తీసుకోవాలని సూచించారు.