
శ్రీశైలం పవర్ హౌస్ ప్రమాదంపై సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఎఫ్ఐఆర్ లో పలు కీలక అంశాలు పోలీసులు నమోదు చేశారు. ఆగష్టు 20వ తేదీ రాత్రి 10 గంటల 20 నిమిషాలకు ప్రాజెక్ట్ లో ప్రమాదం జరిగిందని.. ప్రమాదం జరిగిన వెంటనే ఇంఛార్జి ఉమా మహేశ్వర చారీ పోలీసులకు ఫిర్యాదు చేశారని చార్జీషీట్ లో పేర్కొన్నారు. హైడ్రో పవర్ టన్నెల్ లో పని జరుగుతున్న టైమ్ లో సడన్ గా మెషిన్ లో ప్రమాదం సంభవించిందని… ఆ ప్రమాదంలో ఏఈ, డిఈ, ఏఏఈలతో పాటు మొత్తం 9 మంది సిబ్బంది మృతిచెందినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. చనిపోయిన వారిలో ప్రాజెక్టులో బ్యాటరీలు అమర్చడానికి వచ్చిన అమర్ రాజ కంపెనీకి చెందిన ఇద్దరు మెకానిక్ లు కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే టర్బైన్ వేగం పెరగడం వల్ల ప్యానెల్ యూనిట్స్ లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడినట్లు చార్జీషీట్ లో తెలిపారు. పవర్ హౌస్ జెనరేటర్ లు, కేబుల్ ప్యానెల్స్ ఈ ప్రమాదంలో పూర్తిగా కాలిపోయాయని తెలిపారు. బ్యాటరీ మార్చేటప్పుడు న్యూకిలెన్స్ న్యూట్రల్ గా మారకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని సీఐడీ ప్రాధమికంగా అంచనా కొచ్చింది.
For More News..