
హైదరాబాద్, వెలుగు: హెచ్‌సీఏ కేసులో ప్రధాన నిందితుడు జగన్‌మోహన్ రావును మరో నాలుగు రోజులు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోరింది. బుధవారం మల్కాజ్గిరి కోర్టులో పిటిషన్ వేసింది. గత గురువారం నుంచి మంగళవారం వరకు ఆరు రోజులు కస్టడీలో విచారించినప్పటికీ పూర్తి సమాచారం రాబట్టలేకపోయామని కోర్టుకు తెలిపింది. జగన్‌మోహన్ రావు నుంచి ప్రాసిక్యూషన్‌కు అవసరమైన వివరాలు సేకరించాల్సిన ఉందని పేర్కొంది. సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై కోర్టు గురువారం ఆదేశాలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.
మరోవైపు, జగన్‌మోహన్ రావు సహా కేసులో నిందితులైన ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈవో సునీల్ కాంటె, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవిత, ఆమె భర్త రాజేందర్ యాదవ్ తరఫు లాయర్లు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై కోర్టు విచారణ జరిపింది.