సిగరెట్ ధర.. బంగారం, వెండి లెక్కన పెరగబోతుందా.. దమ్ము కొట్టాలంటే దండిగా డబ్బులుండాల్సిందేనా..!

సిగరెట్ ధర.. బంగారం, వెండి లెక్కన పెరగబోతుందా.. దమ్ము కొట్టాలంటే దండిగా డబ్బులుండాల్సిందేనా..!

సిగరెట్, బీడీ, పాన్ మసాలా, ఇతర పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ, సెస్ విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 1 నుంచి కొత్త ట్యాక్స్ అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్రం. సిగరెట్,పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తులపై 40 శాతం జీఎస్టీ, బీడీలపై 18శాతం జీఎస్టీ విధించనున్నట్లు తెలిపింది కేంద్రం.జీఎస్టీతో పాటు పాన్ మసాలాపై హెల్త్, నేషనల్ సెక్యూరిటీ సెస్ పెంచుతున్నట్లు తెలిపింది కేంద్రం. దీంతో పొగాకు సంబంధిత ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ విధించనున్నట్లు తెలిపింది.

పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ, పాన్ మాసాలపై హెల్త్, నేషనల్ సెక్యూరిటీ సెస్ కి సంబంధించిన రెండు బిల్లులు 2025 డిసెంబర్ నెలలో పార్లమెంట్ ఆమోదించింది.హెల్త్ సెక్యూరిటీ సే నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు 2025 ఆమోదించిన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పాన్ మసాలాపై ఇప్పటికే 40 శాతం జీఎస్టీ విధిస్తున్నామని.. దీనికి సెస్ అదనం అని అన్నారు.

►ALSO READ | నేషనల్ హైవేలకు బూస్ట్.. రెండు కీలక ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం

పాన్ మసాలా తయారీ, కేంద్రాల సామర్ధ్యాన్ని బట్టి సెస్ చెల్లించాల్సి ఉంటుందని అన్నారు నిర్మలాసీతారామన్. కొత్త ట్యాక్స్ విధానం ద్వారా సమకూరే  నిధులను పబ్లిక్ హెల్త్, నేషనల్ సెక్యూరిటీ బలోపేతానికి ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.

కేంద్రం విడుదల చేసిన కొత్త ట్యాక్స్ నోటిఫికేషన్ ప్రభావం సిగరెట్ కంపెనీలపై పడింది. ఈ నోటిఫికేషన్ తో ప్రముఖ సిగరెట్ కంపెనీలు ఐటీసీ, గాడ్ ఫిలిప్స్ షేర్లు నష్టాల బాట పట్టాయి. BSEలో ఐటీసీ షేర్లు 52 వారాల కనిష్ఠానికి పడిపోగా.. ఫిలిప్స్ షేర్లు 10 శాతం మేర తగ్గాయి.