ఆత్మహత్య చేసుకోబోయిన వ్యక్తిని కాపాడిన సినీనటుడు

ఆత్మహత్య చేసుకోబోయిన వ్యక్తిని కాపాడిన సినీనటుడు

ఆత్మహత్య చేసుకోబోయిన ఓ వ్యక్తిని కాపాడాడు సినీ నటుడు ఇంద్రసేనా. ఈ ఘటన నగరంలో అత్తాపూర్  పిల్లర్ నెంబర్ 125 దగ్గర ఫ్లైఓవర్ పై జరిగింది. అత్తపూర్ బ్రిడ్జి పై నుండి దూకెందుకు ప్రయత్నిస్తున్న ఓ యువకుడిని.. అదే సమయంలో అటుగా వెళుతున్న నటుడు ఇంద్రసేన జరగబోయే నేరాన్ని గ్రహించి అతడిని ఆపాడు. బ్రిడ్జి పైనుంచి దూకబోతుడంగా వెనుక నుంచి వచ్చి ఆ యువకుడిని అడ్డుకున్నాడు.

ఆ యువకుడి గురించి వివరాలు అడగగా.. బ్రిడ్జ్ పైనుండి దూకితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక స్కార్పియో కార్ ఇస్తాడాని,  పేపర్లో అందుకు సంబంధించి స్టేట్ మెంట్ చూసానని.. ఇలా పొంతనలేని సమాధానాలు చెపుతున్నాడు. అతడి లాంగ్వేజ్ ని బట్టి నార్త్ ఇండియన్ అని తెలుస్తుంది. అయితే సకాలంలో స్పందించి ఒక ప్రాణాన్ని కాపాడిన సినీనటుడు, జిమ్ నిర్వాహకులు ఇంద్రసేనా ను అక్కడి ప్రజలు అభినందించారు.