సీఎం కేసీఆర్కు సినీ, రాజకీయ ప్రముఖుల విషెస్

సీఎం కేసీఆర్కు సినీ, రాజకీయ ప్రముఖుల విషెస్

సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా.. రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ సహా తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ.. కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ.. కేసీఆర్ కు బర్త్ డే విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. ఆయనకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయువును ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్.. సీఎం కేసీఆర్ కు ఫోన్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ సహా పలువురు బర్త్ డే విషెస్ చెప్పారు.

సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ట్వీట్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం విమర్శనాత్మకంగా శుభాకాంక్షలు చెప్పారు. ఎప్పటికప్పుడు రంగులు మార్చే.. ఊసరవెల్లి ఫొటోను ట్వీట్ చేసి కేసీఆర్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. అలాగే భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.

ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్  తదితరులు కేసీఆర్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాస్ మహారాజ రవితేజ, నిర్మాత బీఏ రాజు టీమ్, దర్శకుడు హరీశ్ శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ సహా పలువురు సినీ ప్రముఖులు.. సీఎంకు శుభాకాంక్షలు చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

ప్రముఖ కమెడియన్ ప్రదీప్ మృతి

మా ముగ్గురిని కూడా పెళ్లి చేసుకున్నాడు

మన జవాన్ల కష్టం చూస్తే కండ్లు చెమ్మగిల్లాల్సిందే