చదువుకున్న అమ్మాయిలే టార్గెట్గా 17 పెళ్లిళ్లు

చదువుకున్న అమ్మాయిలే టార్గెట్గా 17 పెళ్లిళ్లు

అతడి వయస్సు 66  ఏళ్లు. అయితేనేం అమాయక మహిళలను ట్రాప్ చేయడంలో దిట్ట. అంతేనా వారిని పెళ్లిళ్లు చేసుకుని వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తాడు. కాటికి కాళ్లు చాపిన వయస్సులో కూడా అతడు పెళ్లికి సిద్ధమయ్యాడు. కాదు..కాదు నిత్య పెళ్లికొడుకులాగా మారాడు. ఒడిశా కేంద్రపర జిల్లాకు చెందిన నకిలీ డాక్టర్ బిభు ప్రకాష్ అలియాస్ రమేష్ స్వైన్ మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పలు రాష్ట్రాలకు చెందిన 14 మంది మహిళలను వివాహం చేసుకున్న కేటుగాడి జాబితాలో మరో ముగ్గురు భార్యలు వచ్చి చేరారు. దీంతో అతగాడు మొత్తం 17 మంది మహిళలను వివాహం చేసుకున్నాడని భువనేశ్వర్ కు చెందిన డీసీపీ తెలిపారు. అంతేకాదు బిభు ప్రకాష్ మరికొంత మంది మహిళలను కూడా మోసం చేసి పెళ్లిళ్లు చేసుకున్నాడనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఇంకా ఎవరైనా ఫేక్ డాక్టర్ వలలోపడి మోసపోయిన వారు ఉంటే ధైర్యంగా ముందుకు రావాలని సూచించారు. తాజాగా పోలీసులను ఆశ్రయించిన ముగ్గురు భార్యలు కూడా ఉన్నత విద్యావంతురాళ్లే. అందులో ఒకరు వైద్యురాలు కాగా.. మరో ఇద్దరు చార్టర్డ్ అకౌంటెంట్స్ కావడం విశేషం.

భగవంత్ మాన్ ఓ తాగుబోతు 

రూపాయికే గులాబీ దోశ