
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ మొదలైంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోలింగ్ బూత్ లో క్యూలైన్లో నిలబడి ఓటు వేస్తున్నారు. మంచిర్యాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి. ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు ఓటు వేశారు. బంజారాహిల్స్ నందినగర్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఓటు వేశారు.
జూబ్లీహిల్స్ లో కీరవాణి, సుమంత్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకోవాలని సుమంత్ అన్నారు. హైదరాబాద్ లో ఓటింగ్ శాతం పెరగకపోవడం బాధకరమని చెప్పారు.
హీరో ఎన్టీఆర్ తన కుటుంబంతో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. తన సతీమణి లక్ష్మీ ప్రణతి, తల్లి షాలినితో కలిసి ఎన్టీఆర్ వచ్చారు. అల్లు అర్జున్ బీఎస్‌ఎన్‌ఎల్ సెంటర్ పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు