
అపార్ట్ మెంట్ ఏ షేప్ లో ఉండాలి. ఏ ఆకారంలో ఉన్న అపార్ట్మెంట్ తీసుకుంటే వాస్తు ప్రకారం ఇబ్బందులు ఉండవు.. వాస్తుకు.. అపార్ట్ మెంట్ షేప్ కు ఎలాంటి సంబంధం ఉంటుంది.. నివసిస్తున్న ఇంటి దక్షిణం స్థలంలో క్యాంటిన్ నిర్మించుకోవచ్చా.. వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ ఏమంటున్నారో తెలుసుకుందాం. . .
ప్రశ్న : మేం కొత్తగా అపార్ట్ మెంట్ కొన్నాం. అది చతురస్రాకారంలో ఉంది. మా ఫ్రెండ్ అలా ఉండకూదరని చెప్పాడు. నిజమేనా? అపార్ట్ మెంట్ వాస్తు ప్రకారం ఏఆకారంలో ఉంటే మంచిది?
జవాబు: అపార్ట్ మెంట్ చతురస్రం, దీర్ఘచతురస్రాకారంలో ఉండటం మంచిచే బిల్డింగ్, షాపు, ఇల్లుఅపార్ట్ మెంట్ ఏదైనా ఇవే ఆకారాల్లో ఉండాలి. త్రిభుజాకారంలో లేదా కొన్ని మూలలు పెరిగి, కొన్ని మూలలు తగ్గితే మంచిది కాదు. మీ ఫ్రెండ్ చెప్పిన మాటలు పట్టించుకోవాల్సిన పనిలేదని వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ అంటున్నారు.
ALSO READ : Vastu Tips: ఇంట్లో వాటర్ సంప్.. ఇంకుడు గుంత ఎక్కడ ఉండాలో తెలుసా..!
క్యాంటిన్ కట్టుకోవచ్చా?
ప్రశ్న : మా ఇంటికి దక్షిణం వైపు ఖాళీస్థలం ఉంది. అక్కడ రెండు గడులు కట్టి క్యాంటిన్ నడపాలనుకుంటున్నాం. వాస్తు ప్రకారం ఇబ్బందులేమైనా ఉన్నాయా? క్యాంటిన్‌కు. వాస్తుకు సంబంధం ఉంటుందా?
జవాబు: ఇంటి కి దక్షిణంవైపు మీరు క్యాంటిన్ పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు రావు. పొయ్యి ..తూర్పు ఆగ్నేయంలో పెట్టుకోవాలి. వంటచేసే వ్యక్తి తూర్పు ముఖం పెట్టి పంచాలి. ఇంటికి, క్యాంటిన్ కు లింక్ లేకుండా చూసుకోవాలని వాస్తు సిద్దాంతి కాశీనాథుని శ్రీనివాస్ చెబుతున్నారు.