
డీఆర్డీఓ రిక్రూట్మెంట్ అండ్ అసోసియేట్ సెంటర్ (డీఆర్డీఓ, ఆర్ఏసీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 31.
పోస్టుల సంఖ్య: 152
పోస్టులు: సైంటిస్ట్– బి (డీఆర్డీఓ) 127, సైంటిస్ట్/ ఇంజినీర్ బి(ఏడీఏ) 09, సైంటిస్ట్– బి(ఎన్కార్డెడ్ పోస్టులు) 16.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బి.టెక్ లేదా బీఈ, ఎంఏ, ఎంఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: అన్ రిజర్వ్డ్/ ఈడబ్ల్యూఎస్‌లకు 35 ఏండ్లు, ఓబీసీలకు 38 ఏండ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 40 ఏండ్లు మించకూడదు.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: జులై 31.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ పురుష అభ్యర్థులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
సెలెక్షన్ ప్రాసెస్: గేట్ స్కోర్ ఆధారంగా ఇంటర్వ్యూలకు షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో కనబర్చిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు rac.gov.in వెబ్సైట్లో సంప్రదించగలరు.