సినీ రచయిత సి.ఎస్.రావు కన్నుమూత

సినీ రచయిత సి.ఎస్.రావు కన్నుమూత

సుప్రసిద్ధ సినీ, నవలా, నాటక రచయిత సీ.ఎస్.రావు (85) క‌న్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయ‌న మంగ‌ళ‌వారం హైదరాబాదులో తుదిశ్వాస విడిచారు. మెగాస్టార్ చిరంజీవి మొదటి సినిమా ప్రాణం ఖరీదు, కుక్కకాటుకు చెప్పుదెబ్బ, జాతీయ అవార్డు సినిమా ఊరుమ్మడి బతుకులు, నాయకుడు వినాయకుడు, మల్లెమొగ్గలు వంటి ఎన్నో సినిమాలకు కథలు అందించారు సీఎస్ రావు.  నాటక రంగానికి విశేషమైన సేవ చేసి, ఎన్నో అవార్డులని సైతం గెలుచుకున్నారు. ఎందరో నటీనటులకి ఆచార్యులుగా కూడా వ్యవహరించారు.

వీరు ప్రస్తుతం చిక్కడపల్లి గీతాంజలి స్కూల్ కరెస్పాండెంట్ గా వ్యవహరిస్తున్నారు. సి.ఎస్.రావుకి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో పెద్ద కుమారుడు సింగపూరులో ఉండడం వల్ల రాలేని పరిస్థితి. లాక్ డౌన్ నియమాలను గౌరవించి, ఎవ్వరూ పరామర్శకు వ్యక్తిగతంగా వచ్చే ప్రయత్నం చేయవద్దని కుటుంబ సభ్యులు సినీపరిశ్రమ మిత్రులని, శ్రేయోభిలాషులని కోరారు. బుధవారం హైదరాబాదులోనే అంత్యక్రియలు జరగనున్నాయని తెలిపారు.