
న్యూఢిల్లీ: ఫార్మా కంపెనీ సిప్లా భారత్‌లో వెయిట్ మేనేజ్‌మెంట్ రంగంలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోందని, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ (సీఎన్‌ఎస్) రంగంలో విస్తరిస్తుందని యాన్యువల్ రిపోర్ట్‌లో షేర్‌హోల్డర్లకు కంపెనీ ఎండీ ఉమంగ్ వోహ్రా వివరించారు. ఊబకాయం, డయాబెటిస్ మేనేజ్‌మెంట్ కోసం పెరుగుతున్న మార్కెట్‌ను సద్వినియోగం చేసుకునేందుకు అనేక దేశీయ ఫార్మా సంస్థలు ఔషధాలను అభివృద్ధి చేస్తున్నాయి.
ఎలీ లిల్లీ అండ్ కో (అమెరికా) భారత్‌లో మౌంజారో యాంటీ- ఒబెసిటీ మందును , నోవో నార్డిస్క్ (డెన్మార్క్) వెగోవీని ప్రవేశపెట్టాయి. ఈ మందులకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. దీంతో సిప్లా కూడా ఈ సెగ్మెంట్‌లోకి త్వరగా ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది.